బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.
రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్నాథ్ కోవింద్ జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. పౌరులు మహాత్మా గాంధీ జీవితం, బోధనల గురించి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు ఆలోచించాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు.
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి.
india and china population decreased by year of 2100: ప్రపంచంలో జనాభా పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022 లెక్కల ప్రకారం చైనాలో జనాభా 142.6 కోట్లుగా ఉంటే భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. అయితే ఓ సర్వే ప్రకారం 2100 నాటికి చైనా జనాభా 49.4 కోట్లకు తగ్గిపోనుంది. అంతేకాకుండా భారత్లో కూడా జనాభా 100.3 కోట్లకు చేరనుంది. అంటే భారత్లో జనాభా 41 కోట్లు…
Amazon Satellite internet services in india: దేశంలో మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్…
ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.
Alcohol Abusers in india: దేశవ్యాప్తంగా ఆల్కహాల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు దేశంలో ఎంతమంది మద్యం తాగుతున్నారు అన్న విషయంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన నషా ముక్తి అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మద్యం తాగుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా 3 కోట్ల మంది గంజాయి, 9.4 లక్షల మంది కొకైన్, 15.47 లక్షల మంది ఏటీఎస్ వాడుతున్నట్లు…