తనను గొప్ప ప్రధాని అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇరు దేశాల సంబంధాలపై కూడా సానుకూల పరిణామాలను అభినందించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టినా.. ఏ దేశం కెళ్లినా ఒకటే ప్రసంగం చేస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు యుద్ధాలు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. భారత్-పాకిస్థాన్ యుద్దంతో పాటు ఆరు యుద్ధాలు ఆపానంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు.