ఆంధ్రా యూనివర్సిటీలో టెన్షన్.. టెన్షన్..
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఏయూ వీసీ రాజీనామా డిమాండ్ తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఎగ్జామ్స్, క్లాస్ లు బహిష్కరించారు.. క్యాంపస్ లో ర్యాలీలు నిర్వహించారు.. ఏయూ హాస్టల్‌లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక మృతిచెందిన నేపథ్యంలో.. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆ విద్యార్థి మృతిచెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.. తమ సమస్యలు పట్టించుకోని వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్‌లోకి దూసుకువెళ్లారు. భారీ ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు విద్యార్థులు.. WE WANT జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు.. దీంతో, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. స్టూడెంట్స్ నినాదాలతో దద్దరిల్లిపోతోంది ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్..
ఏయూలో విద్యార్థి మృతిపై స్పందించిన మంత్రి న లోకేష్.
ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మృతి చెందడంతో.. ఉద్రిక్తత నెలకొంది.. నిన్నటి నుంచి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. అయితే, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి మృతిపై స్పందించారు మంత్రి నారా లోకేష్.. వర్సిటీలో రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు.. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని.. అంతేకానీ వైస్ ఛాన్సలర్ లను ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. అలా కాకుండా రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలకు వెనకడబోమాని హెచ్చరించారు.. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ వేస్తాం. 100 రోజుల్లోపు రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకుంటామని ప్రకటంచారు మంత్రి నారా లోకేష్..
వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతోన్న పవన్ కల్యాణ్.. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు..!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.. ఫీవర్‌తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.. ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.. అయితే, గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నా.. జ్వరం తీవ్రత తగ్గలేదు.. దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు పవన్ కల్యాణ్.. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అందుకోసం ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తనున్నారు పవన్ కల్యాణ్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక రోజు ముందు నుంచే జూనియర్ కాలేజీలకు సెలవులు
తెలంగాణలో ఇప్పటికే స్కూల్ విద్యార్థులు దసరా సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే, ఇప్పుడు జూనిర్ కాలేజీలకు కూడా సెలవులు వచ్చేస్తున్నాయి.. తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు 2025 సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఒక రోజు ముందుగానే అంటే రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ న ఉంచి తెలంగాణలో జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నాయి.. అంటే, ముందుగా ప్రకటించినట్లు కాకుండా ఒక రోజు ముందు నుండే దసరా సెలవులు ప్రారంభం అవుతాయి.. ఇక, ముందుగా ప్రకటించిన ప్రకటారం.. వచ్చే నెల 5వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు కొనసాగనున్నాయి.. కాగా, సెప్టెంబర్ 21వ తేదీ నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా హాలీడేస్ ఇచ్చారు.. అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవులను బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపిన విషయం విదిమతే.. ఇక, అన్ని కాలేజీలు సెలవుల షెడ్యూల్ ను తప్పకుండా పాటించాలి.. సెలవుల్లో క్లాస్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ..
భారీ వర్షాలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. లోతట్టు ప్రాంతాల వారు.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్‌శి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం.. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.. ఇక, సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ఎన్నికల వేళ బీహార్ మహిళలకు మోడీ దసరా కానుక.. ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పవిత్ర నవరాత్రి పండుగలో మహిళల ఆశీస్సులు తమకు గొప్ప బలం అని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మోడీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సోదరీమణులందరికీ ఈరోజు రూ.10 వేలు చేరుతాయని చెప్పారు. ఒకప్పుడు దోపిడీ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందేనని.. గతంలో ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే.. చివరికి 15 పైసలు మాత్రమే చేరేదని ఆరోపించారు. మధ్యలో దోచుకునే వారు ఉండడంతో చాలా అన్యాయం జరిగిందని వివరించారు. ఇప్పుడు అలా కాకుండా నేరుగా అకౌంట్లలో రూ. 10 వేలు పడిపోతున్నాయని చెప్పారు.
మోడీ-పుతిన్ సంభాషణపై నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు. భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ పర్యటనలో మార్క్ రుట్టే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అత్యధిక సుంకం భరిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే సుంకాలు కారణంగా పుతిన్‌తో మోడీ చర్చలు జరుపుతున్నారని.. భవిష్యత్ వ్యూహాన్ని వివరించాలని పుతిన్‌ను మోడీ అడిగినట్లుగా మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. అయితే రుట్టే వ్యాఖ్యలపై ఇప్పటి వరకు భారత్ గానీ.. రష్యా గానీ స్పందించలేదు.
గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. రెండు రోజుల పాటు తగ్గినట్టే తగ్గి.. శుక్రవారం మళ్లీ షాకిచ్చాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. తులం బంగారంపై రూ.440 పెరిగాయి. సిల్వర్‌పై ఏకంగా 3,000 పెరిగింది. దీంతో ఆల్‌టైమ్ రికార్డ్ దిశగా వెండి ధర దూసుకెళ్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.440 పెరిగి రూ.1, 14, 880 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరిగి రూ.1, 05, 300 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.330 పెరిగి రూ.86,160 దగ్గర అమ్ముడవుతుంది. ఇక కిలో వెండిపై మాత్రం 3,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,43, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో రూ. 1,53,000 అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో మాత్రం రూ.1,43, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి తగ్గేదిలేదు.. ‘అనగనగా ఒక రాజు’ ప్రోమో రిలీజ్
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులను నవ్వుల కనుక అందివ్వబోతున్నట్టు అర్ధం అవుతోంది. బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది. టీజర్ లో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదాల వేడుకకు వేదికగా ఈ టీజర్ నిలిచింది. ఇప్పటికే విడుదైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవీన్ యొక్క అద్భుతమైన కామెడీ టైమింగ్ ప్రతి ఫ్రేమ్ లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచింది. కేవలం ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివితో రూపొందిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా హాస్యం, తాజాదనం మరియు కమర్షియల్ పంచ్‌లను మిళితం చేసే చిత్రాలను ఎంచుకోవడంలో నవీన్ పొలిశెట్టి నైపుణ్యాన్ని పునరుద్ఘాటించింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నవీన్ ఖాతాలో మరో ఘన విజయం ఖాయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగ ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
OG తెలుగు రాష్ట్రాల మొదటి రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్.. రికార్డ్ మిస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ నడిచాయి. ప్రీమియర్స్ + డే 1 వరల్డ్ వైడ్ వందకోట్ల షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయితే తెలుగు స్టేట్స్ లో చాలా సెంటర్స్ లో పుష్ప 2, దేవర, RRR డే 1 వసూళ్లను అందుకోవడంలో కొంచం వెనకబడింది.