తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫలితాల కోసం ntvtelugu.com వెబ్‌సైట్‌ను కూడా సంప్రదించవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ 4,33,082 మంది హాజరు కాగా 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరు కాగా 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించి 67.27 శాతం నమోదైంది. ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత కాగా.. అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 56.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండియర్ లో 67.26 శాతం పాస్ అయ్యారు. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్ అయ్యారు. ఇక అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయ్యారు. ఈరోజు 2022-23 ఫలితాలను విడుదల చేసామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించామని, విద్యార్థి దశలో ఇంటర్ కీలకమన్నారు. జీవితానికి టర్నింగ్ పాయింట్ అని తెలిపారు. మన రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ పరీక్షలకు 9,45,153 మంది హాజరయ్యారని తెలిపారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. 26 వేల మంది సేవలందించారని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలెవరూ ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం.. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా సమస్యలు చెబితే పరిష్కారం.. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరుగా పర్యవేక్షించనుంది ముఖ్యమంత్రి కార్యాలయం. సంక్షేమ పథకాలు, వైయస్ఆర్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు ఫోన్ చేసిన వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు.
అదానీ, మోడీ బంధాన్ని ప్రశ్నిస్తే రెండేళ్ళ శిక్ష
అదానీ, మోడీ బంధాన్ని ప్రశ్నిస్తే రెండేళ్ళ శిక్ష వేశారని, దేశ వ్యాప్తంగా దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి అనే నినాదంతో ముందుకు వెళ్తాం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రకాశం జిల్లాలో ఆయన మోడీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాత్రం మోదీ, జగన్ హటావో అంటూ కార్యక్రమాలు చేపడతాం..జగన్, మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారు..మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే 2500 ఉన్న టికెట్ ధరలను 25 వేలు చేశారు..ఎయిర్ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటం వల్లే దుస్థితి..దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు..విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారు.. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట..కేంద్రానికి మద్దతుగా ఉంటే బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వేల కోట్ల బాకీలు కూడా రద్దు చేస్తున్నారు..అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చింది..ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారు..ప్రభుత్వ రంగ సంస్థల నుండి అదానీకి పెట్టుబడులు పెట్టించారు..మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారు.. వాళ్ళే దేశాన్ని దోచుకుంటున్నారు..బీజేపీని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు..కేరళ ప్రభుత్వాన్ని ఏమి చేయలేక బీజేపీ చొరవతో సినిమా తీయించారు..కర్ణాటకలో గెలుపు కోసం మోదీ మతాల మధ్య చిచుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారు..అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటు గురయ్యేలా చేశారు..
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. భోపాల్‌కు చెందిన 11 మంది, హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు..ఎలక్ట్రానిక్ డివైస్, డ్రాగర్స్ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో భోపాల్, హైదరాబాద్‌లో ఆపరేషన్ నిర్వహించారు. యువతను ఉగ్రవాదంవైపు మళ్లిస్తున్న టెర్రరిస్టులు..హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఐదుగురిని మధ్యప్రదేశ్‌కు తరలింపు..18 నెలల నుంచి హైదరాబాద్‌లో మకాం వేసిన నిందితులు. హైదరాబాద్‌లో భారీ ఆపరేషన్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు…..హైదరాబాద్‌లో 16 మందిని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్
స్నేహితుడిపై దాడి..గంజాయి మత్తులో దారుణం
మత్తు వదలరా… గంజాయి మత్తువదలరా అని పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసైన యువత ఘోరాలకు కారణం అవుతున్నారు. ఆస్తి కోసం కన్నవారినే కడతేరుస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలకు, తీవ్రమయిన దాడులకు తెగబడుతున్నారు. గంజాయి మత్తులో విజయవాడలో చోటుచేసుకున్న ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపరిచింది. విజయవాడలో స్నేహితుడి పై దాడి చేసి హత్య చేశారు మిగతా ముగ్గురు స్నేహితులు. గంజాయి మత్తులో హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. స్నేహితుల దాడిలో హత్యకు గురైన వ్యక్తిని అజయ్ సాయిగా గుర్తించారు. నిందితులను నాగార్జున, మణికంఠ, ప్రశాంత్ గా గుర్తించారు పోలీసులు. ఇయర్ బర్డ్స్ విషయంలో వివాదం తలెట్టంతో అజయ్ పై మిగతా ముగ్గురు తీవ్రంగా దాడిచేయడం కలకలం రేపింది. కంకిపాడులో రోడ్డు ప్రమాదం జరిగినట్టు ఆసుపత్రిలో చేర్చి డ్రామా ఆడిన నిందితులకు వైద్యులు షాకిచ్చారు. అయితే, ప్రమాదం వల్ల తగిలిన దెబ్బలు కాదని దాడి చేస్తే తగిలిన దెబ్బలు గా నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు వైద్యులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
టమోటా రైతుల ఆవేదన.. కేజీ 2 రూపాయలే
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టుగా మారింది టమోటా రైతుల పరిస్థితి. మార్కెట్లోకి వెళ్ళి టమోటా కొనే వినియోగదారులు భారీగా ధర చెల్లించాల్సి వస్తోంది. కేజీ 15 నుంచి 20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. అదే ఖరీదైన సూపర్ మార్కెట్లయితే చెప్పాల్సిన పనిలేదు. కేజీ 25 రూపాయల పైమాటే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె మార్కెట్ కు రికార్డు స్ధాయిలో టమోటా పంట చేరింది. ఇటీవల వర్షాలు పడడంతో దిగుబడి కూడా భారీగానే ఉంది. 585 టన్నుల టమోటాను మార్కెట్ కు తీసుకొని వచ్చిన రైతులు..ధర లేక ఆందోళన చెందుతున్నారు. కేజీ టమోటా ధర ప్రస్తుతం రెండు నుండి మూడు రూపాయలు పలుకుతుంది. వ్యాపారస్తులు సిండికేట్ తో కనీస ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు టమోటా రైతులు..కూలీలు, ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు పోను తిరిగి ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు మిగలడం లేదంటున్నారు రైతులు. కూలీలను పెట్టుకోలేక పంటను పొలంలోనే వదిలేస్తున్నారు రైతులు. టమోటా ధర ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలీడం లేదని మరికొందరు రైతులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే టమోటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా సరఫరా చేయాలని రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు.
పదేళ్ళ తర్వాత ఇంటికి వచ్చిన భర్త.. కానరాని లోకాలకు కొడుకు
కుటుంబ భారం మోసేందుకు ఓతండ్రి ఉపాధి నిమిత్తం పదేండ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లేముందు తనకు రెండేళ్ల బాబు ఉన్నాడు. ఉపాధి నిమిత్తం పదేండ్ల నుంచి గల్ఫ్‌లోనే తండ్రి ఉంటున్నాడు. నిన్న కుటుంబంతో ఆనందంగా గడిపేందుకు ఇంటికి వచ్చాడు. తన పిల్లలను చూసి న తండ్రి మురిసిపోయాడు. కానీ.. ఆతండ్రికి మురిపెం క్షణాల్లోనే ఆవిరైపోయింది. మంచినీళ్ల కోసం ఇంటి నుంచి బయలు దేరిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆతల్లి కన్నీరుమున్నీరైంది. గుండెలు బాదుకుంటూ కన్నకొడుకుని చూసి రోదించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టించింది. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్, పద్మిని దంపతులకు కూతురు హర్ష, కుమారుడు శివకార్తీక్ ఉన్నారు. అయితే శివకార్తీక్‌కు రెండేళ్ల వయసున్నప్పుడు మోహన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అప్పటి నుంచి మోహన్ ఫోన్ లో పిల్లల బాగోగులు తెలుసుకునేవాడు. పదేళ్ల తర్వాత సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో భార్యాపిల్లలు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి మోహన్‌ను ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ల ఇంట్లో తాగునీరు అయిపోవడంతో శివకార్తీక్ యాక్టివా తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. బైపాస్ రోడ్డులోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన శివకార్తీక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
సినిమా బాన్… ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఊహించని స్టేట్మెంట్
గత వారం రోజులుగా ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ‘ది కేరళ స్టొరీ’. దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేశాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటించిన ది కేరళ స్టొరీ మే 5న రిలీజ్ అయ్యింది. “కేరళలో 32000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, ఇందులో ఎక్కువ శాతం హిందూ అమ్మాయిలే ఉంటున్నారు. వీరిని కొంతమంది ఆతంకవాదులు, ప్రేమ పేరుతో మోసం చేసి… మత మార్పిడి తర్వాత దేశం నుంచి బయటకి తీసుకోని వెళ్లి… అక్కడ నుంచి ఇండియాపైకి చెయ్యబోయే తీవ్రవాద కార్యకలాపాల్లో భాగం చేస్తున్నారు” అనే కథతో ‘ది కేరళ స్టొరీ’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీని తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాలు బాన్ చేశాయి. కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఆ స్థాయిలో ఒక సినిమాని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి సైతం ది కేరళ స్టొరీ గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు, కొన్ని రాష్ట్రాలు బాన్ చేస్తుంటే, ఉత్తర ప్రదేశ్-మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మాత్రం ది కేరళ స్టొరీ సినిమాని టాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటించాయి.