భారతదేశంలో 535 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 6,591 నుంచి 6,168కి తగ్గాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
Most Miserable Country: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది.
మామూలు జనం రూ.2వేల నోటు చూసి చాలా కాలమైంది. అసలు చూద్దామంటే ఒక్క నోటేలేదంటే కట్టలెక్కడుంటాయి. అంటే, సామాన్య జనం దగ్గర ఒక్క నోటూ లేదు. ఏటీఎంలలో రావటం మానేసి చాలా ఏళ్లైంది. యూపీఐ ట్రాన్సాక్షన్లకు జనం అలవాటు పడ్డారు. క్యాష్ అవసరమైతే వంద, ఐదొందలు నోట్లు వాడుతున్నారు.
PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.
PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
26/11 Mumbai terror attacks: 26/11 ముంబై ఉగ్రదాడులు సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా, భారత దేశానికి అప్పగించనుంది. 2008లో జరిగి ఈ దాడి యావత్ దేశంతో పాటు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసింది. నిందితులో్లో ఒకడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి అక్కడి కాలిఫోర్నియా కోర్టు అంగీకరించింది. భారత్-అమెరికాల మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది.
భారతదేశం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ల కోసం ఇంజిన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది.
Warming World: భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఎక్కువ కావడంతో గత కొన్ని దశాబ్ధాలుగా భూగోళం ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తోంది. కర్భన ఉద్గారాల విడుదల కూడా ఇందుకు ఓ కారణం అవుతోంది. వేడిగా ఉండే దేశాలు మరింత వేడిగా మారుతున్నాయి. సమశీతోష్ణ దేశాలు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. ధృవాల వద్ద మంచు వేగంగా కరిగిపోతుంది. ఇదే జరిగితే కొన్నేళ్లలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే నగరాలు కనుమరుగు అవుతాయి.