Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్పూర్లోని 13 ప్రాం తాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ…
ODI World Cup: ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. దీని కోసం బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ప్రపంచకప్ జరగనుంది. జూన్ 7 నుండి భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత 2023 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
Ashwini Vaishnaw: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల 2014 నుంచి దేశ సామాజిక, ఆర్థిక పరివర్తనకు దారి తీశాయని, రెండేళ్లలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచానికి ఆశాకిరణంలా కనిపిస్తోందని,
NATO : గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య స్నేహం చాలా బలంగా మారింది. దీని ఫలితం వ్యాపారం రంగంలో కూడా కనిపించింది. రక్షణ రంగంలో కూడా ఇరు దేశాలు దగ్గరయ్యాయి. ఈ ఎపిసోడ్లో, నాటో ప్లస్‌లో భారత్‌ను చేర్చాలని అమెరికాలో సిఫార్సు చేయబడింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో యుద్ధానికి అవసరమయ్యే ఆయుధాల విడిభాగాల్లో కూడా కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
Monsoon: జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించబోతున్నాయి. సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4 తేదీన కేరళలోకి ప్రవేశిస్తున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది.
Russia: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్( FATF) నుంచి రష్యాను సస్పెండ్ చేశారు.