Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశం రణరంగంగా మారింది. ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్, లాహోర్, క్వెట్టా ఇలా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఆందోళనలు మిన్నంటాయి.
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని విస్తరించాలని ఫాక్స్ కాన్ భావిస్తుంది. దీంతో ఈ సంస్థ భారత్ లో పెట్టుబడులు పెడుతోంది. ఫాక్స్‌కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, ఆపిల్ ఐఫోన్ల ప్రధాన అసెంబ్లర్.
జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.
పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ల్యాండింగ్ సమస్య కారణంగా పది నిమిషాల పాటు మన దేశ పరిధిలో చక్కర్లు కొట్టింది. పేలవమైన వాతావరణం వల్ల పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా ఉంచింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు.
భారత రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ అద్భుతంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో భద్రతా బలగాలు, వివిధ రాష్ట్రాల శకటలు, ఆయుధ ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు కళ్లు తిప్పుకోకుండా సాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అంతటి ప్రాధాన్యమున్న పరేడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.