ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో ఓటమి తర్వాత సరిగ్గా నెల రోజుల విరామం అనంతరం భారత అభిమానుల కోసం మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. భారత జట్టు మరోసారి సంప్రదాయ క్రికెట్లో కొత్త పోరుకు సన్నద్ధమైంది. 2023–25 డబ్ల్యూటీసీ క్యాలెండర్లో భాగంగా భారత్ తమ తొలి సిరీస్ బరిలోకి దిగనుంది.
Poverty: దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
PUBG love story: పాకిస్తాన్ మహిళ సీమా హైదర్(30), నోయిడా వ్యక్తి సచిన్ మీనాల(25) ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పబ్జీ గేమ్ ఇద్దరు ప్రేమలో పడేందుకు కారణం అయింది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్,
భారతదేశ సంప్రదాయాలు, పద్దతులు, కట్టుబాట్లు ప్రపంచదేశాలకు పాకుతున్నాయి. మన దేశంలోని దేవుళ్లను సైతం పలు దేశాల్లో ఆరాధిస్తున్నారు. అందరి బంధువు లార్డ్ హనుమంతుడి ఖ్యాతి కూడా ప్రపంచ దేశాలకు పాకింది. ఇందులో భాగంగానే రేపటి ( బుధవారం ) నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రారంభమయ్యే ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఈ ఏడాది ఎడిషన్‌కు 'లార్డ్ హనుమాన్' చిహ్నాన్ని అధికారికంగా ప్రకటించారు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు.
IND vs WI Dream11 Prediction Today Match: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య జూలై 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత్, వెస్టిండీస్ జట్లు సన్నదవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే వెస్టిండీస్ కన్నా.. భారత్ బలమైన…
WI vs IND Schedule, Teams and Live Streaming Details: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నారు. విండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లలో భారత్ ఆటగాళ్లు తలపడనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇక టీ20ల్లో సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. భారత్ vs…
Harbhajan Singh picks India Playing XI for 1st Test vs West Indies: దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరేబియన్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నారు. ముందుగా టెస్ట్ సిరీస్ ఆరంభం కానుండగా.. తొలి టెస్ట్ బుధవారం మొదలవునుంది. ఈ టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ…
భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే సహా పలువురు ఆటగాళ్లు డిఫరెంట్ డ్రిల్ చేస్తున్న వీడియోను బీసీసీఐ సోమవారం పోస్ట్ చేసింది. ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్‌తో పాటు, టీమ్ ఇండియా తన ఫీల్డింగ్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేక కసరత్తు చేసింది.