సిరీస్ ఎవరి వశం అన్నది ఈ మ్యాచ్ తో తేలిపోనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్ లు గెలిచి సమానంగా ఉండగా.. ఈమ్యాచ్ తో సిరీస్ ఎవరికి లభిస్తుందో తెలుస్తుంది. అందుకోసం భారత్, వెస్టిండీస్ తుది సమరానికి సిద్ధమయ్యాయి. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా 5వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. అయితే ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది.
Read Also: Rajanikanth : బద్రీనాధుని క్షేత్రంను సందర్శించిన తలైవా..
భారత్ బ్యాటింగ్ తరుఫున చూస్తే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. 4వ టీ20లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కూడా అదే ఊపుతో ఆడితే టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది. అతనికి తోడు మరో ఓపెనర్ గిల్ కూడా.. మంచి ఫామ్ లోనే కనపడుతున్నాడు. వీరిద్దరూ స్టాండ్ అయ్యారంటే.. భారత్ స్కోరు భారీగానే ఉండనుంది. మరోవైపు తెలుగుకుర్రాడు తిలక్ వర్మ కూడా.. మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు. ఎట్టకేలకు సిరీస్ ఫలితం తేల్చే మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చూపించి.. సిరీస్ నెగ్గాలని చూస్తున్నారు. అటు వెస్టిండీస్ కూడా.. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ, టీ20 సిరీస్ నెగ్గాలని కసిగా ఉంది.
Read Also: Leopard: తిరుమల నడకమార్గంలో 2450 మెట్టు వద్ద కనిపించిన చిరుత
భారత తుది జట్టు:
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్ తుది జట్టు:
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్