Team India Captain Hardik Pandya hails young players talent in WI vs IND T20 Series: వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడిన భారత్.. ఆ తర్వాత రెండు టీ20ల్లో పుంజుకొని 2-2తో సమం చేసింది. ఇక కీలకమైన ఐదో టీ20లో మాత్రం చేతులెత్తేసి.. 3-2తో సిరీస్ కోల్పోయింది. ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. తొలిసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత్ సిరీస్ ఓడిపోవడం గమనార్హం. మ్యాచ్ అనంతరం ఓటమిపై హార్దిక్ మాట్లాడాడు.
ఓటమి కూడా ఒక్కోసారి మంచిదే అని, చాలా నేర్చుకోవచ్చని ఐదో టీ20 మ్యాచ్ ప్రెసెంటేషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ‘నేను బ్యాటింగ్‌కు వచ్చినపుడు జట్టు స్కోర్ బాగానే ఉంది. ఆ తర్వాత జోరును కొనసాగించడంలో మేం విఫలమయ్యాం. వేగంగా రన్స్ చేయలేకపోయాము. పరిస్థితులను సద్వినియోగం చేసుకుని పరుగులు సాధించడంలో వెనకపడిపోయాం. ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతాయని తెలుసు. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు మేం ప్రయత్నించాం. ఈ ఓటమి గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మా ప్లేయర్స్ ఎలా ఆడతారో నాకు తెలుసు’ అని హార్దిక్ తెలిపాడు.
Also Read: Nandyala: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ.. 22 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి!
‘ఒక్కోసారి ఓటమి కూడా మంచి మంచిదే. ఎందుకంటే చాలా విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. యువకులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇది ఆటలో భాగం. కొందరు యాంగ్ ప్లేయర్స్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం సంతోషంగా ఉంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఇక్కడే జరగనుంది. అప్పుడు మరింత ఎక్కువ మంది అభిమానులను కలుస్తాం’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
Hardik Pandya said, "losing is good sometimes, it teaches you". pic.twitter.com/UXp28owH8t
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 13, 2023