India Loans: అప్పుల కుప్పగా దేశం.. 9 ఏళ్లల్లో రూ. 100 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Loans: దేశ ఆర్థిక పరిస్థితి దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతోంది. ఇండియా చేస్తున్న అప్పుల విలువ రోజు రోజుకు పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో గత 9 ఏళ్ల కాలంలో రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 67 ఏళ్లల్లో చేసిన దానికంటే ఇది ఎక్కువగా ఉందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అప్పులు పెరిగిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ర్టాలు పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయని పదే పదే చెబుతున్న కేంద్రం… తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని విమర్శిస్తున్నాయి.
Read also: Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం..
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 14 మంది ప్రధానమంత్రులు పాలించారు. వారందరూ కలిసి 67 ఏండ్లలో రూ.55.87 లక్షల కోట్లు అప్పు చేయగా.. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 9 ఏళ్లల్లో రూ. 100 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినట్టు అధికారిక లెక్చలు వెల్లడిస్తున్నాయి. 2014కు ముందు కేంద్రం ఏటా రూ.83 వేలకోట్ల అప్పు చేస్తే… మోదీ వచ్చాక నెలకే రూ.93 వేల కోట్లకుపైగా అప్పులు చేస్తున్నారు. అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలతో దేశం వందేండ్ల వెనక్కు వెళ్లిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ స్థూల జాతీయోత్పత్తిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడో దాటేసిందని అర్థమవుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం అప్పులు రూ.105 లక్షల కోట్లు. అప్పటికి జీడీపీలో కేంద్రం చేసిన అప్పులు 52 శాతం. 2020-21వ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అప్పులు రూ.122 లక్షల కోట్లు. ఆ ఏడాదికి జీడీపీలో అప్పులు 61 శాతంగా ఉన్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం చేసిన అప్పులు 9 శాతానికిపైగా పెరిగాయి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మొత్తం అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం చూస్తే జీడీపీలో దేశం చేసిన అప్పు 58 శాతానికి పెరిగిపోయింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కంటే 18 శాతం ఎక్కువగా కేంద్రం అప్పులు చేసేసింది.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!