Sanju Samson: బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్లో ఆడుకోవడమే! అర్ష్‌దీప్ కంటే తక్కువ యావరేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netizens Trolls Sanju Samson After Poor Show against Windies T20I Series: కేరళ వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్కువగా అవకాశాలు ఇవ్వదని ఓ అపవాదు ఉంది. దాన్ని చెరిపేసేందుకు ఇటీవలి కాలంలో శాంసన్‌కు బీసీసీఐ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయితే సంజూ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. సిరీస్ డిసైడర్ ఐదో టీ20లో కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన సంజూ 3 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు సంజూ శాంసన్ ఆడాడు. అయితే 3 మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. 12, 7, 13 స్కోర్లు చేసి నిరాశ పరిచాడు. ఈ సంవత్సరం సంజూ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతడి టాప్ స్కోర్ 13 పరుగులుగా కావడం గమనార్హం. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఈ అత్యధిక స్కోర్ చేశాడు.
Also Read
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
- Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
సంజూ శాంసన్ 2015లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన తర్వాత.. 5 ఏళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని 2020లో తిరిగి వచ్చి ఆ ఏడాది 6 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 23 పరుగులు మాత్రమే చేశాడు. 2021లో 3 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్కసారి కూడా భారీ స్కోర్ చేయలేకపోయాడు. 2022లో సంజూ 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీ (77) చేశాడు. సంజూ టీ20 కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. 2023లో వరుసగా అవకాశాలు వస్తున్నా.. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Also Read: Hardik Pandya: ఓటమి కూడా మంచిదే.. చాలా సంతోషంగా ఉన్నా! హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పటివరకు సంజూ శాంసన్ తన కెరీర్లో 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 18.5 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేశాడు. 22 మ్యాచ్‌లలో 19 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటగలిగాడు. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే.. ఏ జట్టుపైనా అతడు రాణించలేదు. ఐపీఎల్ అంటే రెచ్చిపోయే అతడి బ్యాట్.. టీ20లో మాత్రం మూగబోయింది. తాజా విండీస్ ప్రదర్శనతో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023కు భారత జట్టులో సంజూకు చోటు దక్కే అవకాశం లేదు. దాంతో సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. సంజూ అంతర్జాతీయ కెరీర్ క్లోజ్, ఇక ఐపీఎల్లో ఆడుకోవడమే మిగిలుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!