యూనిఫాం సివిల్ కోడ్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నది. ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతి అన్ని మతాలను ప్రభావితం చేస్తుందని వారు వాదిస్తున్నారు. కానీ, అదే ముస్లిం మహిళలు మాత్రం ఇందుకు భిన్నమైన వాణి వినిపిస్తున్నట్లు ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మెజార్టీ ముస్లిం మహిళలు యూనిఫాం సివిల్ కోడ్‌కి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా టీమ్ కు దూరంగా ఉన్నాడు. టీమిండియాలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో.. ఈసారి కూడా ఇషాంత్ శర్మకు చోటు దక్కలేదు. కానీ వెస్టిండీస్ సిరీస్ లో ఇషాంత్ కనిపించనున్నాడు. భారత్, వెస్టిండీస్ సిరీస్‌లతో ఇషాంత్ అరంగేట్రం చేయబోతున్నాడంటే.. నిజమనే చెప్పాలి కానీ మ్యాచ్ లో కాదు. ఈ సిరీస్‌లో ఇషాంత్ కామెంట్రీ చేస్తూ కనిపించనున్నాడు.
Former India captain Sourav Ganguly Picks 5 Semi-Finals Teams for World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో పాటుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉన్నాయి. మెగా టోర్నీలో సెమీస్ చేరే జట్లేవో అని మాజీలు తమ అభిప్రాయాలు చెపుతున్నారు.…
నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
శనివారం వీరిద్దరూ స్టైల్ షర్టులు ధరించి ఓ హోటల్ కు లంచ్ చేయడానికి వెళ్లారు. వారిద్దరికీ ఇష్టమైన సుషీ డిష్ ను తింటూ.. కెమెరాకు ఫోజులు ఇస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు ఐతే.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్‌లో ధరించినట్టు గుర్తించారు.
దేశంలో రైల్వేశాఖ ఒకదాని తర్వాత ఒకటిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే ఫీడ్‌బ్యాక్ ప్రకారం వందేభారత్ రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు వందేభారత్ రైళ్లలో 25 మార్పులు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఇండియా ఆర్థికంగా.. హార్థికంగానూ సాయం చేయడానికి ముందుకొచ్చింది. శ్రీలంక తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో సహాయం చేయడానికి భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.…
Threads: ట్విట్టర్‌కి పోటీగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ దుమ్మురేపుతోంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి.
జీపీటీ చాట్‌కి లాగిన్ కావాలి.. ఇది మీకు మొదటిసారి అయితే.. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి.. సెర్చ్ బార్లో మీ ప్రశ్నను హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ లో టైప్ చేయండి. మీరు ఎంటర్ నొక్కిన వెంటనే, చాట్‌బాట్ మీకు స్థానిక భాషలో ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మేము నిజంగా చెక్ ఇన్ చేసినప్పుడు, చాట్‌బాట్ హిందీ, బెంగాలీలో రియాక్ట్ అయింది. త్వరలో ఇతర స్థానిక భాషల్లో కూడా చాట్ జీపీటీ సమాధానాలు ఇవ్వనుందని దాని నిర్వహకులు తెలిపారు.