2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఓటమి ఎరగకుండా తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్న టీమిండియా.. ఇంగ్లండ్ పై గెలుపు కోసం కన్నేసింది. మరోవైపు భారత్ పై గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది.
Minister Karumuri: చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం..
ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు కూడా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో సూర్యకుమార్ ను ఆడించాలనే ఆలోచనలో టీమిండియా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య ఏ మాత్రం ప్రభావం చూపలేదు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఒకే మార్పుతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మరోవైపు రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. లక్నోలో స్పిన్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది కావున.. అతని స్థానంలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకురానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
Egypt: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలు ఢీకొని 35 మంది దుర్మరణం
టీమిండియా తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్