World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir React on India Defeat in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో ఓటమి లేకుండా ఫైనల్ చేరిన భారత్.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ టైటిల్ గెలవడంపై పలువురు భారత మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్ దక్కలేదని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌తో పాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ వాదనను మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. ఇది వింత వాదన అని, అత్యుత్తమ జట్టే ప్రపంచకప్ గెలిచిందన్నాడు. ఫైనల్‌లో భారత్ బాగా ఆడలేదన్న నిజం ఒప్పుకోవాల్సిందే అని గౌతీ అన్నాడు.
స్పోర్ట్స్‌కీడాతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘చాలా మందికి నేను చెప్పేది నచ్చకపోవచ్చు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ 2023 గెలవలేదని కొంతమంది అంటున్నారు. అది వాస్తవం కాదు. వాస్తవానికి అత్యుత్తమ జట్టే ప్రపంచకప్ గెలిచింది. నిజాయితీగా మాట్లాడితే.. భారత్ 10 మ్యాచ్‌లు గెలిచి చాలా మంచి ఫామ్‌లో ఉంది. కాబట్టి ఫైనల్‌లో ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. అత్యుత్తమ జట్టు మాత్రమే ప్రపంచకప్‌ను గెలుస్తుంది’ అని అన్నాడు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Also Read: Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
‘భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది కానీ ఒక మ్యాచ్‌లో పేలవంగా ఆడింది. సెమీ ఫైనల్, ఫైనల్ నాకౌట్ మ్యాచ్‌లు కాబట్టి బాగా ఆడాలి. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచామా? లేదా 4వ స్థానంలో నిలిచామా? అనేది ముఖ్యం కాదు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ సాధించిందని అంగీకరించండి. ఫైనల్‌లో భారత్ బాగా ఆడలేదు. మీరు ఈ వాస్తవానికి దూరంగా ఆలోచించకండి’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో 7 ఓవర్లు ఉండగానే ఛేదించింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!