విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు.
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 133 కోవిడ్ కేసులు పెరిగాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 1,389 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.. ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, 24 గంటల్లో రెండు మరణాలు – గుజరాత్ మరియు మహారాష్ట్ర నుండి ఒక్కొక్కటి – నివేదించబడ్డాయి.. ఈ రాష్ట్రాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.. డిసెంబరు…
డ్రాగన్ కంట్రీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (MDP) రెడీ అవుతుంది.
భారతదేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( CMFRI) ఒక కీలక ప్రాజెక్ట్ చేపట్టింది. సీఫుడ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
బిక్షగాళ్ల సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించిందేకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, చారిత్రిక ప్రదేశాల్లో బెగ్గర్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతుంటారు. కొందరు ఎలాంటి ఆధారం లేని దివ్యాంగులు, అనాథ పిల్లలు, వృద్ధులు యాచిస్తుంటారు. ఇంకొందరు ఆయా కారణాల చేత ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. మరికొందరైతే ఈ…
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాడ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 పరుగులకు ఆలౌటైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. భారత్ రెండో ఇన్నింగ్స్…
ఉప్పల్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.