ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం భారత సరిహద్దు దేశం భూటాన్ వెళ్లారు. శుక్రవారం మోడీ బిజిబిజీగా గడిపారు. అక్కడ ప్రభుత్వ పెద్దలతో మోడీ సమావేశం అయి పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’’ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ స్వయంగా ప్రధాని మోడీకి ప్రదానం చేశారు.
ఇదిలా ఉంటే భారత్-భూటాన్ మధ్య వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి. త్వరలో రైలు మార్గాల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మోడీ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఇంధనం, వాణిజ్యం, డిజిటల్ కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయ రంగాల్లో కూడా ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య రైలు సంబంధాల స్థాపనపై అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేశాయి. ఇండియా-భూటాన్ మధ్య కోక్రాఝర్-గెలెఫు రైలు లింక్, బనార్హట్-సంత్సే రైలు లింక్ విధానాలతో సహా రెండు ప్రతిపాదిత రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి ఎంవోయూలు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: South China Sea: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కవ్వింపు.. ఫిలిప్పీన్స్ శాస్త్రవేత్తల నౌక అడ్డగింపు..
ఇదిలా ఉంటే భూటాన్ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని నరేంద్రమోడీ చరిత్ర సృష్టించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీకి ఇది మూడో అత్యున్నత విదేశీ పురస్కారం. అంతకుముందు ఈ అవార్డును కేవలం నలుగురికి మాత్రమే భూటాన్ ఇచ్చింది. 2008లో రాయల్ క్వీన్ అమ్మమ్మ ఆషి కేసాంగ్ చోడెన్ వాంగ్‌చుక్‌కి, 2008లో హిస్ హోలీనెస్ జె త్రిజుర్ టెన్జిన్ డెండప్ (భూటాన్‌కు చెందిన 68వ జే ఖెన్పో)కి, 2018లో హిస్ హోలీనెస్ జె ఖెన్పో ట్రుల్కు న్గావాంగ్ జిగ్మే చోడ్రా ఈ అవార్డు అందించారు.
ఇది కూడా చదవండి: INDIA Bloc: సీఈసీని కలవనున్న కూటమి.. దేనికోసమంటే..!
అంతకు ముందు ఈ రోజు భూటాన్ పారో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ ప్రధాని షేరింగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. పారో నుంచి రాజధాని థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులుతీరి మోడీకి స్వాగతం పలికారు.
#WATCH | Thimpu: The King of Bhutan confers the Order of the Druk Gyalpo on Prime Minister Narendra Modi.
As per ranking and precedence established, the Order of the Druk Gyalpo was instituted as the decoration for lifetime achievement and is the pinnacle of the honour system in… pic.twitter.com/hkszvDdWyd
— ANI (@ANI) March 22, 2024