India-Canada Row: ఇండియా-కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిపై భారత్ ఘాటుగానే స్పందిస్తూ.. ఉగ్రవాదులకు మీరు స్థావరం ఇస్తున్నారని, మీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Banana Exports: అమెరికాతో సైనిక ఒప్పందంపై ఈక్వెడార్‌తో ఉద్రిక్తతల మధ్య భారత్ నుంచి అరటిపండ్లను దిగుమతి చేసుకోవాలని రష్యా భావించింది. దీంతో భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభయ్యాయి. భారత్ నుంచి మొదటి బ్యాచ్ అరటిపండ్లు జనవరిలో రష్యాకు ఎగుమతి అయ్యాయి. తదుపరి బ్యాచ్ ఫిబ్రవరి చివరిలో ఎగుమతి అవ్వనుందని రష్యన్ వాచ్డాగ్ రోసెల్‌ఖోజ్నాడ్జోర్‌ని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. రష్యన్ మార్కెట్‌కి భారత్ అరటిపండ్ల ఎగుమతులు పెరుగుతున్నట్లు పేర్కొంది.
మయన్మార్ సరిహద్దు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్- మయన్మార్ల సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు.
త్వరలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్.. టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన తర్వాత ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా…
600 Peoples Dies in Zambia Due to Cholera: ఆఫ్రికా దేశం అయిన జాంబియా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాంబియాను ప్రస్తుతం కలరా వ్యాధి పట్టిపీడిస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారినపడగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మంది కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు.…
POCSO Case Filed on Indian Hockey Player Varun Kumar: భారత హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. వరుణ్ కుమార్ తనపై గత ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి పేరుతో గత ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల…
ప్రపంచం మొత్తానికి భారతదేశం అవసరం ఉంది.. దానికి అనుగుణంగా దేశం ఎదగాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఏదో ఒక కారణంతో భారత్ ఎదగలేకపోతే ఈ ప్రపంచం మొత్తం వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
దేశం పేరు మార్చాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా మళ్లీ లోక్‌సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
India won by 106 runs against England in Vizag: వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలిచింది. టామ్ హార్ట్లీ (36)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు…