Moscow terror attack: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి మరియు ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికల్లో గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఈ దారుణ ఘటన సంభవించింది. రష్యా రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
Read Also: Water Crisis: బెంగుళూరులా మారనున్న మరో ఐదు నగరాలు.. నీటి కోసం యుద్ధాలు తప్పవా ?
మాస్కో దాడిలో 60 మంది మరణించిగా.. 140 మంది గాయపడినట్లు సమాచారం. దాడిలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగులు ఆర్మీ యూనిఫాంలో వచ్చారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు క్రోకస్ సిటీ హాల్‌పై గ్రెనేడ్ విసిరారు. దీంతో మాల్‌లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సోషల్ మీడియాలో అనుబంధ ఛానెల్‌లలో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొంది.మాస్కోలో జరిగిన ఉగ్రదాడి గురించి అమెరికా స్పందించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఈ దాడిపై 15 రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. మాస్కోపై 48 గంటల్లో పెద్ద దాడి జరగబోతోందని అమెరికా చెప్పినప్పటికీ, ఆ సమయంలో దాడి జరగలేదు. 15 రోజుల తర్వాత దాడి జరిగింది.