Bhutan PM: మా అన్నయ్య నరేంద్ర మోడీకి భూటాన్ స్వాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన భూటాన్- భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ సందర్భంగా “నా అన్నయ్య నరేంద్ర మోడీజీ భూటాన్‌కు స్వాగతం” అని భూటాన్ ప్రధానమంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. దీంతో పాటు భూటాన్ రాజు ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న పెద్ద హౌర్డింగ్ చిత్రాన్ని పంచుకున్నారు.
Read Also: Penamaluru: పెనమలూరు సీటుపై వీడిన ఉత్కంఠ.. సంబరాల్లో బోడె ప్రసాద్..
Also Read
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ రాకకు ముందు పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీ భూటాన్ ప్రధానితో ఉన్న పోస్టర్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ మొత్తం పూలమాలలు, రంగోలీలతో అలంకరించారు. ప్రధాని మోడీకి స్వాగతం పలుతూ భూటాన్ సంస్కృతిని తెలిపే రంగురంగుల జెండాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రధాని మోడీ కాన్వాయ్ పారో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని థింపూకు వెళ్తుండగా.. పెద్ద సంఖ్యలో భూటాన్ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా భారత జెండాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. అలాగే, థింపూలో ప్రధాని మోడీ రాకను స్వాగతిస్తూ జిగ్మే లోసెల్ ప్రైమరీ స్కూల్‌లోని పాఠశాల పిల్లలు రోడ్డుపై నిలబడి స్వాగతం పలికారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపటం కష్టం.. కానీ, ఒక మార్గం ఉంది..!
ఈ పర్యటనలో ప్రధాని మోడీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లను కలవనున్నారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గేతో కూడా ప్రధానితో చర్చలు జరపనున్నారు. భారతదేశం- భూటాన్‌ల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటనలో ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’ని నొక్కి చెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
भूटान में आपका स्वागत है, मेरे बड़े भाई। @narendramodi Ji pic.twitter.com/Kjc87llncg
— Tshering Tobgay (@tsheringtobgay) March 22, 2024
URL
#WATCH थिम्पू: भूटान के लोगों ने पीएम मोदी का गर्मजोशी से स्वागत किया। pic.twitter.com/miDlW5NSET
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..