జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు.
* ఇవాళ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే.. సిడ్నీ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం * ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్: ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ * ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం.. ఇవాళ ఏపీలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్…
* నేడు బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ.. * దుబాయిలో మూడవ రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు.. తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. దుబాయ్ లీమెరిడియన్ హోటల్ లో సాయంత్రం 6.30 గంటలకు తెలుగు ప్రజలతో ఎపి ఎన్ఆర్టి నేతృత్వంలో సమావేశం * అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన…
మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య బంధం చెడింది. ట్రంప్-మోడీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా ఆ బంధం మళ్లీ చిగురిస్తున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా నివేదికలు అందుతున్నాయి.
దీపావళి వేడుకల్లో ప్రధాని మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విమర్శలు గుప్పించారు. క్వీన్స్‌లోని హిందూ దేవాయాలను సందర్శించిన తర్వాత భారతీయులను ఉద్దేశించి మమ్దానీ ప్రసంగించారు. భారతదేశంలో కొన్ని రకాల భారతీయులకు మాత్రం స్థలం ఉందని.. అదే దార్శనికతతో భారతదేశాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.