* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ముందుగా క్షేత్ర సంప్రదాయం మేరకు వరహా స్వామి వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి.. అటు తరువాత శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి..
* అమరావతి: ఇవాళ సచివాలయంలో పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఉదయం 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖపై.. మధ్యాహ్నం 12.30కి గృహ నిర్మాణ శాఖపై, మధ్యాహ్నం 2.30కి వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ
* ఆదిలాబాద్: నేడు ఛలో బోరాజ్.. రైతు సమస్యలపై జాతీయ రహదారి దిగ్బంధంకు పిలుపు. బీఆర్ఎస్ తోపాటు అఖిల పక్షం ఆధ్వర్యంలో హలో రైతన్న ఛలో బోరాజ్.. కపాస్ కిసాన్ యాప్ రద్దు తోపాటు పరిమిత లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ తో నిరసనలకు పిలుపు.
* ఏపీ హైకోర్టులో టీటీడీ పరకామణి చోరీ కేసుపై విచారణ జరపాలని పిటిషన్.. నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం
* తిరుపతి: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటలకు పల్లకీ వాహన సేవ. మధ్యాహ్నం ఊరేగింపుగా శిల్పరామం నుండి అమ్మవారి ఆలయానికి చేరుకోనున్న తిరుమల శ్రీవారి ఆలయం కాసుల హారం… మధ్యాహ్నం 3.30 గంటలకు నాలుగు మాడ వీధుల్లో ఉత్సవర్ల ఊరేగింపు. రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ..
* విశాఖ: నేడు శాసన సభాపక్ష పిటీషన్ల కమిటీ పర్యటన.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అధ్యక్షతన శాసన సభాపక్ష పిటీషన్ల కమిటీ సమావేశం.. సమగ్ర భూ సర్వే అంశంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చేసిన ఫిర్యాదు పరిశీలనలో భాగంగా జిల్లాలో పర్యటన
* తిరుమల: ఇవాళ ఆన్ లైన్‌లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల
* కాకినాడ: అన్నవరం దేవస్థానంలో ముగిసిన కార్తీక మాస మహోత్సవాలు.. పంపా నదిలో పోలి పాడ్యమి దీపాలు వెలిగిస్తున్న మహిళలు.. నెల రోజుల్లో 1లక్ష 34 వేల 500 వ్రతాలు. సుమారు రూ 23కోట్ల ఆదాయం. రికార్డు స్థాయిలో ప్రసాదాలు అమ్మకాలు. 23 లక్షలు పాకెట్స్ అమ్మకం.. నెల రోజుల్లో 20లక్షలు మంది సత్యదేవుని దర్శించుకున్న భక్తులు
* నేటితో శ్రీశైలంలో ముగియనున్న కార్తీక మాసోత్సవాలు.. నెల రోజులుగా ఆలయంలో నిర్వహిస్తున్న శివ సప్తాహ భజనలు పరిసమాప్తి
* శ్రీ సత్యసాయి : నేడు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 9 వ రోజు కొనసాగనున్న సత్యసాయి శత జయంతి వేడుకలు. వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూలతో సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా అలంకరించిన భక్తులు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని సత్యసాయి మహాసభలు దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు.
* ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా .. పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. పెరుగుతున్న చలి తీవ్రత. గడిచిన 24 గంటల్లో కొమురం భీం జిల్లాలో 8 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. ఆదిలాబాద్ జిల్లాలో 9.1, నిర్మల్ జిల్లా లో 10.3, మంచిర్యాల జిల్లాలో 11.6 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత.. పలు చోట్ల సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.4 డిగ్రీలుగా నమోదు.. మెదక్ జిల్లాలో 8.7, సిద్దిపేట జిల్లాలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
* అమరావతి: ఇవాళ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ.. మాచర్లలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేసిన పిన్నెల్లి
* ఇవాళ్టితో ఏపీ లిక్కర్ కేసులో 8 మంది నిందితుల రిమాండ్ పూర్తి.. 8 మంది నిందితులను ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు