* నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. మంత్రులుగా 20 మంది ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్.. పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం..
* నేడు బీహార్ కు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్.. ఉదయం 8గంటలకు పాట్నా బయల్దేరనున్న చంద్రబాబు..
* నేడు బీహార్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్ కుమార్.. ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోడీ, ఎన్టీఏ నేతలు..
* నేడు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు వైఎస్ జగన్.. ఉదయం 11: 30కి సీబీఐ కోర్టుకు హాజరు కానున్న జగన్..
* నేటి నుంచి 23 వరకు తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణలు.. ఇవాళ్టి నుంచి అభ్యంతరాల స్వీకరణ.. ఈ నెల 22లోగా అభ్యంతరాల పరిష్కరణ.. ఈ నెల 23న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్న ఈసీ..
* నేడు తిరుపతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. మధ్యాహ్నం 3: 25కి రేణిగుంట ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి ముర్ము.. మధ్యాహ్నం 3:55కి పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న ముర్ము.. సాయంత్రం 5గంటలకి తిరుమల చేరుకోనున్న రాష్ట్రపతి..
* నేడు రంపచోడవరం వెళ్లనున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ ప్రెస్ మీట్..
* నేడు రాజమండ్రిలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ అండ్ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన వాయిదా.. ఈవేళ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కలిసి నారా లోకేష్ కూడా సదరు కార్యక్రమానికి హాజరవుతున్న కారణంగా పర్యటన రద్దు..
* నేటి నుంచి తెలంగాణ- నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు.. రెండు విడతల్లో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు.. నేటి నుంచి హైటెక్స్ లో ఉత్సవాలు.. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజ్ భవన్ లో ఉత్సవాలు..
* నేడు నల్గొండ జిల్లాలో ప్రహ్లాద్ జోషి పర్యటన.. FCI కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి..
* నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 20 అంశాలపై సమావేశంలో చర్చ..
* నేడు ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో తీవ్రమైన చలిగాలులు.. మిగతా జిల్లాల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు..
* నేడు ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు..