సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈరోజు మళ్లీ 2024 టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు తలపడనున్నారు. ఇరు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు జరుగనుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేయనుంది. డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
India–Russia Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను మరోసారి ప్రశంసించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని చెప్పుకొచ్చారు. భారత్ ఓ గొప్ప దేశం.. వారితో మా సంబంధాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేదన్నారు కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పురి.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా మీడియా సంస్థ అయిన ఆస్ట్రేలియా టుడేపై కెనడా ఆంక్షలు విధించింది. కెనడాలో ఆ సంస్థ ప్రసారాలు, వార్తలు ప్రజలకు చేయకుండా బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
India-Canada: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ ఇటీవల అక్కడి హిందూ ఆలయంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.