వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు వెళ్లేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసినట్లు ఐసీసీకి తెలియజేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. ఐసీసీ ఈ-మెయిల్పై పీసీబీ స్పందించలేదు. ఐసీసీ నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా అందినప్పుడే పాకిస్తాన్ తన విధానాన్ని వెల్లడిస్తుందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం చెప్పారు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గం.కు ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత్లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు…