మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ రెండో మ్యాచ్లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి.
దక్షిణాఫ్రికాలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 అందాల పోటీలో కీట్ యూనివర్సిటీ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థిని తృష్ణా ర.. మిస్ టీన్ యూనివర్స్ 2024 టైటిల్ను గెలుచుకుంది. కిట్ ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్ విద్యార్థిని తృష్ణా రే ఈ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా కిట్ విశ్వవిద్యాలయం, ఒడిశా, భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.