ఆస్ట్రేలియాలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాల పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పార్లమెంటరీ దేశాల ప్రతినిధులతో కలిసి ఉండటం ఎంతో గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. బియ్యం, నూనె, పప్పులు.. ఇలా ఒక్కటేంటి అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ బ్రాండ్‌పై తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యం విక్రయాలను పునః ప్రారంభించింది.
దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు సోమవారం ఆర్బీఐ తెలిపింది.
న్యూజిలాండ్‌పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ప్రత్యేక ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని విడుదల చేసింది. సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పేరుతో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు రెండు ఎంపికలలో లభిస్తాయి. స్టాండర్డ్ ప్యాక్ ధర ప్రస్తుత మోడల్ కంటే INR 24,000. ఆప్షనల్ ప్యాక్ ధర INR 51,700.