Champions Trophy 2025: భారత్‌కు రావొద్దు.. పాక్‌కు హర్భజన్ కౌంటర్!
- భారత్‌కు పాకిస్థాన్ రావొద్దు
- పరిస్థితులు చక్కబడేవరకు భారత్ పర్యటించదు
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని జరగనివ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్‌లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్‌కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌కు తాము సిద్దమే అని తెలిపింది.
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తామని చెప్పిన పీసీబీ.. ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో పాకిస్తాన్ టీమ్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లాడని, ఆ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా హామీ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పీసీబీకి కౌంటర్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు పాక్ రావొద్దని, తమకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు టీమిండియా పర్యటించదని భజ్జీ చెప్పుకొచ్చాడు.
Also Read
Also Read: IND vs AUS: అడిలైడ్ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెన్నిస్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘పాకిస్థాన్‌కు ఇష్టం లేకపోతే భారత్‌కు అస్సలు రావొద్దు. మాకు ఎలాంటి బాధ లేదు. పాక్ టీమ్ భారత్‌కు రాకపోతే.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు. పాకిస్థాన్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటే.. ఈ విషయంలో భారత్ వైఖరి మరోలా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని జరగనివ్వండి. టోర్నీని పాక్ ఆపలేదు. మలేసియా, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు చక్కబడేవరకు భారత్ పర్యటించదు’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!