మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక…
Trump Trip To India: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విదేశీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన తొలిరోజు ఎలాంటి సంచలన ఆర్డర్స్‌పై సంతకాలు చేస్తారనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ భారతదేశ పర్యటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
PM Modi : వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి అంతర్జాతీయ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో మాట్లాడతారు.
Google : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్, భారతదేశంలోని వరాహా అనే స్టార్టప్‌తో కార్బన్ డయాక్సైడ్ తొలగింపు (CDR) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ వరాహా నుండి కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేస్తుంది. వరాహా వ్యవసాయ వ్యర్థాలను బయోచార్గా మార్చే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. బయోచార్ అనేది బొగ్గు ఒక రూపం, ఇది వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను సేకరించి మట్టిలో నిల్వ చేస్తుంది. గూగుల్, వరాహా మధ్య కుదిరిన ఈ ఒప్పందం…
ఆ అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడే దాన్ని కాదన్నారు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరందరూ చూశారు. కానీ, నేను నా దేశం నుంచి కట్టుబట్టలతో రావడంపై చాలా బాధగా ఉందని షేక్ హసీనా కన్నీరు పెట్టుకుంది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతుంది. తాజాగా వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ చేసే డెమోను సక్సెస్ పుల్ గా నిర్వహించింది.
PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు.