ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం ఫోకస్.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే..!
ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా దృష్టి పెట్టారు.. ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు పెట్టారు… ఎమ్మెల్యేలు.. కూటమి నేతలు కలిసి పని చెయ్యాలని. కూడా మంత్రులు చెబుతున్నారు.. తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి.. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రేడ్యుయేట్ ఎన్నికలతో పాటు.. విశాఖ – శ్రీకాకుళం – విజయనగరం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మంత్రులు నారాయణ.. నిమ్మల రామానాయుడు.. అనగాని సత్యప్రసాద్.. గొట్టిపాటి రవి ఇప్పటికే.. ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే, మంత్రులతో పాటు కూటమి నేతలు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వం.. యువతకు చేస్తున్న కార్యక్రమాలు.. ఉద్యోగాల కల్పన.. గ్రేడ్యుయేట్ ఓటర్లకి మంత్రులు చెప్పాలంటున్నారు సీఎం చంద్రబాబు… మంత్రులు కూడా ఇదే తరహా ప్రచారంపై దృష్టి పెట్టారు. కూటమి నేతలు కూడా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.. జనసేన. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహిస్తున్నారు.. అయితే. జనసేన విడిగా ఈ సమావేశం నిర్వహిస్తోంది… మంత్రులతో త్వరలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రుల కు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. పోలీసులతో వాగ్వాదం..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ.. అయితే, ఈ కేసుపై బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు వంశీ.. కానీ, తీర్పు రావాల్సి ఉండగానే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ.. ఏపీ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారట వల్లభనేని వంశీ.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు.. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.. ఇక, ఈ కేసులో ఈ నెల 20వ తేదీన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది.. మరోవైపు.. హఠాత్తుగా ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.. మరోవైపు.. మట్టి తవ్వకాలకు సంబంధించి.. మరో కేసు కూడా వల్లభనేని వంశీపై నమోదు అయినట్టుగా సమాచారం.. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది..
వల్లభనేని వంశీ అరెస్ట్‌లో బిగ్ ట్విస్ట్..!
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశారు.. అరెస్ట్ సందర్భంగా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారట వంశీ.. కేసు కోర్టులో ఉండగా.. తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వాదించగా.. ఇది మరో కేసు అంటూ.. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు.. అయితే, తాజాగా తనకు ఆ ఫిర్యాదుతో సంబంధం లేదని కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ వేయటంతో.. ఫిర్యాదుదారుడ్ని బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంవీపై మరో కేసు నమోదు చేశారట పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు సత్యవర్ధన్.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.. కానీ, 4 రోజుల క్రితం తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.. కేసుకు తనకి సంబంధం లేదని.. కావాలని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం పేరుతో కేసు పెట్టారని.. పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. ఈ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం.. అక్కడే ఇప్పుడు రివర్స్ ట్విస్ట్ వచ్చి చేరింది..
నేడు జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెంబర్తి గ్రామంలోని విశ్వకర్మ హస్తకళల కేంద్రంను కవిత సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేఖ రాజ్‌ను పరామర్శిస్తారు. ఉదయం 11.30కి పెంబర్తి గ్రామ్ పంచాయత్ కార్యాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతారు. పెంబర్తి గ్రామ పర్యటన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనగామ జిల్లా కేంద్రంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకి జనగామ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1.30కి జనగామలో జిల్లా జాగృతి నాయకులు మురళి గృహ ప్రవేశానికి ఆమె హాజరు కానున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన నేపథ్యంలో పెంబర్తి, జనగామలో బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య.. భార్య ఏం చేసిందంటే..!
జగ్గర్నాట్‌గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ తనువు చాలించాడు. వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాలు.. భార్య మోపిన తప్పుడు ఆరోపణలు కారణంగా తీవ్ర మనస్తాపం చెందడంతో అభినవ్ సింగ్ ప్రాణాలు తీసుకున్నాడు. బెంగళూరులోని కడుబీసనహళ్లిలో అపార్ట్‌మెంట్‌లో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. భార్యతో తలెత్తిన గొడవల కారణంగా రాపర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా పోలీసులు వెల్లడించారు. భార్య తప్పుడు ఆరోపణలు చేయడంతోనే రాపర్ విషం సేవించినట్లుగా తెలుస్తుందన్నారు. పోస్ట్ మార్టం తర్వాత… మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అతని కుటుంబానికి అప్పగించారు. అభినవ్ సింగ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.
ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో పెద్ద స్కామ్… రూ.170కోట్లు సీజ్ చేసిన ఈడీ
QFX ట్రేడ్ లిమిటెడ్, ఇతర అనుబంధ కంపెనీలపై మనీలాండరింగ్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. ఈ కంపెనీలు మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM), ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేశాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీల డైరెక్టర్లలో రాజేంద్ర సూద్, వినీత్ కుమార్, సంతోష్ కుమార్, ప్రధాన కుట్రదారుడు నవాబ్ అలీ అలియాస్ లావిష్ చౌదరి ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన నవాబ్ అలీ అలియాస్ లవిష్ చౌదరి, ప్రస్తుతం UAE నుండి ఈ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. బోట్‌బ్రో అనే MLM కంపెనీని ప్రారంభించాడు. ఫారెక్స్ ట్రేడింగ్ AI రోబోల సహాయంతో జరుగుతుందని, ఇవి స్వయంచాలకంగా కొనుగోలు, అమ్మకాలు చేయగలవని పేర్కొంది. ఇది botbro.biz అనే వెబ్‌సైట్ ద్వారా ప్రచారం జరిగింది. ఇక్కడ పెట్టుబడిదారులు మూడు రకాల పెట్టుబడి ప్రణాళికలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులయ్యారు. ఇవి TLC కాయిన్లలో స్థిర ఆదాయం, సంపాదన ఉంటుందని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 11, 2025న ఈడీ ఢిల్లీ, నోయిడా, రోహ్తక్, షామ్లీ (ఉత్తరప్రదేశ్)లలో దాడులు నిర్వహించింది. ఈ కాలంలో 30 కి పైగా బ్యాంకు ఖాతాలలో జమ చేసిన రూ.170 కోట్లు స్తంభింపజేయబడ్డాయి. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనేక అభ్యంతరకరమైన పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు అక్రమ హవాలా నెట్‌వర్క్ కూడా బయటపడింది.
ప్రపంచంలోనే మొదటి బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు. 2019 జనవరి 31న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బుధవారం ఇంగ్లండ్‌తో భారత్ తరఫున తన 50వ వన్డే మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తి చేసేందుకు గిల్‌కు మూడో వన్డేలో 25 పరుగులు అవసరం కాగా.. గస్ అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాది అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.?
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. కిరణ్ అబ్బవరం గతేడాది “క” సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో దిల్ రూబా సినిమాను అనౌన్స్ చేసారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. మొదట ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేస్తూ మరొక రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం అని ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాను మర్చి 14న రిలీజ్ చేస్తున్నారట. త్వరలోనే ఈ డేట్ ను అధిరేకంగా అనౌన్స్ చేయనున్నారు టీమ్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. క సినిమాకంటే ముందు రావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదాల అనంతరం రాబోతున్న దిల్ రూబా ఏ మేర హిట్ సాధిస్తుందో చూడాలి.
చిరంజీవి ప్రశంసించడం వల్ల.. 400 సినిమాల్లో అవకాశాలు
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌గా నెలదోక్కుకొవడం ఎంత కష్టమో.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిరుపించుకోవడం అంతకన్న కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడిన సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరిస్తూ ఉంటుంది. నటుడు, కమెడియన్ రఘు బాబు దీనికి మంచి ఉదాహరణ అని చెప్పాలి. రఘుబాబు గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలో లెక్కలేన్నని పాత్రలు చేశాడు. 2005లో అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ తనకు మొదటి బ్రేక్. గుడ్డి రౌడీగా తన క్యారెక్టర్ ఎంతో ఆకట్టుకుంది. పేరైతే వచ్చింది కానీ ఎవరూ ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావించలేదు. అయితే తాజాగా తన కెరీర్ ఇప్పుడు ఇలా ఉండటానికి చిరంజీవి కారణం అని తెలిపారు. రీసెంట్ గా ‘బ్రహ్మ ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు రఘుబాబు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ‘బన్నీ’ మూవీ లో నా పాత్ర ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. కానీ దీని గురించి మూవీ టీం ఎక్కడ ప్రసంగించలేదు. ఇక అదే మూవీ వంద రోజుల వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో కూడా నాకు అంతగా గుర్తింపు లేకపోవడం చాలా బాధగా అనిపించింది. సరిగ్గా అప్పుడే ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. మూవీలో నటించిన వాళ్ళు, పని చేసినవాళ్లు అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ రఘుబాబు ప్రస్తావన ఎవరూ తేవడం లేదు.. అదేంటయ్యా ఎవరు నీ గురించి చెప్పడం లేదంటూ అన్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. నన్ను ఆయన స్టేజి మీదకు పిలిచి భుజం మీద చెయ్యేసి చాలా బాగా చేశావని లైవ్ లో మెచ్చుకున్నాడు. ఈ సినిమా మరోసారి చూడాలంటే నువ్వే కారణం అని చెప్పాడు. ఈ ఒక్క మాట నా లైఫ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంత ఓపెన్ గా చిరంజీవి పొగిడేసరికి నాకు ఆఫర్‌లు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు అక్కడితో మొదలుపెడితే ఏకంగా 400 సినిమాలకు పైగా నటిస్తూనే పోయా. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు పడ్డాయి.’ అంటూ తెలిపాడు.
ప్రేమికుల రోజు స్పెషల్.. టాలీవుడ్ హౌస్ ఫుల్
ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది. 14న వస్తున్న మరో సినిమా బ్రహ్మ ఆనందం. చాలా కాలం తర్వాత బ్రహ్మనందం తనయుడు హీరోగా చేస్తున్న ఈ సినిమాను బ్రహ్మీ భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. కంటెంట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాతో గౌతమ్ హిట్ కొడతారు అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటితో పాటు బాలీవుడ్ మూవీ చావా రిలీజ్ కానుంది. రష్మిక మందన్నఎం విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సినిమాల విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని నటించిన ఏటో వెళ్ళిపోయింది మనసు 14న రీరిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ ను గ్రాండ్ స్కేల్ లో ప్రేమికుల కోసం రీరిలీజ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ హీరో సూర్య, సమీరా రెడ్డిల కల్ట్ క్లాసిక్ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా ఆడియన్స్ ను పలకరించనుంది. స్టార్ బాయ్ సిద్దు సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ రేపే థియేటర్లలోకి వస్తుంది.