వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఎలా దొరికిపోయాడంటే..?
మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా మొత్తం ఏడు సెక్షన్ల కింద వల్లభనేనిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ వ్యవహారంలోనే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.. సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.. వంశీపై మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పడమట పోలీసులు.. పడమట పీఎస్‌లో 86/ 2025 వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.. బీఎంఎస్ సెక్షన్ 140, 308, 351 రెడ్ విత్ త్రి బై 5 సెక్షన్ల కింద.. ఎస్సీ, ఎస్టీ సెక్షన్ 3 సెక్షన్ 5ల కింద కేసు నమోదు చేశారు.. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ నుంచి తనకు ఫిర్యాదుతో సంబంధం లేదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించిన వల్లభనేని వంశీ.. సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు దొరికిపోయాడని చెబుతున్నారు.. దీంతో సత్యవర్ధన్ విత్‌డ్రా పిటిషన్ వెనుక కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. సత్యవర్ధన్‌లో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన జోరు.. స్పాట్‌లో వంశీ ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. వంశీ కోర్టు దగ్గరకు వెళ్లిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.. అంతేకాదు.. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించడంతో పాటు.. సత్యవర్ధన్‌కు రూ.10 లక్షల రూపాయాలు ఇచ్చారట వంవీ.. కోర్టులోపటికి సత్యవర్ధన్ ని పంపించి స్టేట్మెంట్ స్వయంగా విత్ డ్రా చేయించారు.. ఇక, పిటిషన్ వేసిన వెంటనే బయటికి వచ్చి వంశీని కలిశాడట సత్యవర్ధన్.. ఆ తర్వాత సత్యని విశాఖకు పంపించిన వంశీ.. తాను నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు..
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన వైసీపీ.. ఇది అక్రమం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వైసీపీ స్పందించింది.. వల్లభనేని వంశీని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడింది.. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్నారు వంశీ మోహన్.. మరోవైపు.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధనే.. ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.. కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది..
జేఈఈ టాపర్‌ను అభినందించిన మంత్రి లోకేష్.. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు..
జేఈఈ టాపర్ మనోజ్ఞను అభినందించారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి కష్టపడటం ఒక్కటే మార్గం, ఎటువంటి దగ్గర దారులు ఉండవు అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.. JEE (Mains) – 2025లో నూటికి నూరుశాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను అభినందించారు లోకేష్.. మనోజ్ఞ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు, మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.. ఏ అవసరం ఉన్న ఒక్క మెసేజ్ పెట్టు.. అన్నగా అండగా ఉంటానని ఫోన్ నెంబర్ ఇచ్చారు.. ప్రతి బిడ్డ విజయంలో తల్లిపాత్ర ఏంటో నాకు తెలుసు. అందుకే ఆమె తల్లి గారిని కూడా సత్కరించాను అని పేర్కొన్నారు.. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న మనోజ్ఞ తండ్రితో కరికులం ప్రక్షాళనపై చర్చించారు. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం ఉండాలనేది నా ఆలోచన, జాబ్ రెడీ యూత్ ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువతను ప్రోత్సహించలనేది తమ ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై హత్యాయత్నం..!
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది.. ఈ ఘటనతో ఒక్కసారిగా దెందులూరు రగిలిపోయింది.. దీంతో, బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠగా మారిపోయింది.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఏలూరులో వైసీపీ నేతలు హత్యాయత్నం చేసినట్టుగా ఆరోపిస్తున్నారు.. పక్కా పథకం ప్రకారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వాగ్వాదానికి దిగి.. ఐరెన్ రాడ్ తో చింతమనేని సహా ఆయన డ్రైవర్, గన్ మెన్ పై వైసీపీ అల్లరి మూకల దాడికి యత్నించాయని.. అంతేకాకుండా చింతమనేని సెక్యూరిటీ దగ్గర నుంచి గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని.. సిబ్బంది అప్రమత్తతతో పెనుముప్పు తప్పిందని చెబుతున్నారు కూటమి నేతలు.. ఈ దాడిలో స్వయంగా దెందులూరు వైసీపీ ఇంచార్జ్ కొటారు అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది పాల్గొన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు..అయితే, బుధవారం రాత్రి వట్లురులో ఒక వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు ఉద్దేశ్య పూర్వకంగా తమ కారును అడ్డుపెట్టి గొడవను అబ్బయ్య చౌదరి సృష్టించారని.. అతని అనుచరులు ముందుగానే సిద్ధంగా ఉన్న వ్యక్తులతో వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టి.. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చింతమనేని వర్గం చెబుతోంది.. కారు అడ్డం తీయాలంటూ చింతమనేని డ్రైవర్ కోరగా.. పథకం ప్రకారం ఒక్కసారిగా విరుచుకుపడిన దాదాపు 25 మంది అల్లరి మూకలు.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, డ్రైవర్ సుధీర్, గన్ మెన్ రవీంద్ర పై ఐరెన్ రాడ్, కర్రలతో దాడికి యత్నించారని.. ఆ దాడిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యక్తిగత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. అక్కడి నుంచి పరారయ్యారని చెబుతున్నారు.
ఏలూరులో ఓ వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ..! క్లారిటీ ఇచ్చిన కలెక్టర్
ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలో.. తెలంగాణలోని ఇంకా కొన్ని జిల్లాలో ఇప్పుడు బర్డ్‌ఫ్లూ టెన్షన్ పెడుతోంది.. ఈ సమయంలో.. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్‌ఫ్లూ సోకినట్టు ప్రచారం జరిగింది.. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని.. కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్‌గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె…. అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్‌లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోకి మరణించిన దాఖలాలు లేవని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. అయితే, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు అరికట్టవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. ఉంగుటూరు మండలం బాదంపూడిలో పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందన్నారు.. బాదంపూడిలో 10 కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందిన కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా పరిగణించాలని.. పది కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్ గా ప్రకటించాలని.. రెడ్ జోన్ పరిధిలో సెక్షన్ 144, సెక్షన్ 133 అమలు చేయాలని.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, కలెక్టరేట్ లో 24/7 హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి..
వల్లభనేని వంశీ అరెస్ట్.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌తో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలించారు.. అయితే, వల్లభనేని వంశీ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని మండిపడిన ఆయన.. వంశీ తల్లి, చెల్లి కూడా ఈ మృగాన్ని శిక్షిస్తేనే సమాజానికి మంచదని అనుకుంటున్నారని పేర్కొన్నారు.. వంశీతో పాటు మరో నాలుగైదు జంతువులు కూడా ఊచలు లెక్కపెట్టి తీరాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, అరెస్ట్ సమయంలోనూ వంశీ డ్రామాలాడాడు.. డ్రెస్ మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లి అందరికీ ఫోన్లు చేసి అల్లర్లు చేయాలని రెచ్చగొట్టాడు.. తాను మనిషి జన్మ ఎత్తలేదన్నట్లు వంశీ వాగిన వాగుడు అందరికీ గుర్తుందని మండిపడ్డారు.. ఏం పీకుతారంటూ ఎగిరెగిరి పడి ఎన్నికల ఫలితాల రోజు మొదటి రౌండ్ కే పారిపోయిన పిరికిపంద వంశీ అని దుయ్యబట్టారు.. శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడేందుకు కూడా ప్రయత్నాలు చేయలేదా ? అని ప్రశ్నించారు.. చేసిన ఒక తప్పు కప్పి పుచ్చుకోవటానికి వందల తప్పులు చేయటం వైసీపీ నేతల నైజం అంటూ విమర్శించారు.. వంశీని ఇన్నాళ్లు ఎలా ఉపేక్షించారో అర్ధం కావట్లేదు.. రాయలసీమలో అయితే వ్యవహారం ఇంకోలా ఉండేది.. వంశీ ప్రవర్తనను ఖండించకపోగా వైసీపీ సీనియర్లు సమర్ధించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..
పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో గేదెల కోసం తీసుకున్న లోన్ కట్టలేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంటి గేటు పీక్కెళ్లిన విషయం తెలిసిందే. లోన్ చెల్లించలేదని రైతు ఇంటి గేటును ట్రాక్టర్ తీసుకొచ్చి మరి బ్యాంక్ అధికారులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం కట్టలేదని ఇంత దారుణమా? అని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా? అని బ్యాంకు అధికారులను కేటీఆర్ నిలదీశారు. ‘రుణం కట్టలేదని.. ఇంత దారుణమా?. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి, రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి, కరెంట్ మోటర్లు అండ్ స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా?. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని.. మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా?. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని.. రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డిపై చూపించగలరా?. పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?. గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు. ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు. జై తెలంగాణ’ అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కి చెందిన నాగనపల్లి సాయన్న, ఖమ్మంకి చెందిన భూక్యా గోపాల్ రావు, భూక్యా శ్రీను, అంకోలు శిరీష, బేబి రాణిలు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు మొహం, శరీరంపై దాడికి పాల్పడ్డారు. మణికొండ పంచవటి కాలనీలో ఈనెల 8న వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని రాఘవ రెడ్డి ఒప్పుకున్నాడు. దాడికి ముందు ఏ2గా ఉన్న నిందితుడు సాయన్నను దమ్మాయిగూడలోని ఉదా రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు. రాఘవ రెడ్డి 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంద్ర పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. హిందూ ధర్మాన్ని కాపాడతానని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ను సిద్దం చేయాని భావించాడు. ఇందు కోసం ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చి ప్రేరేపించాడు.
వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక సమర్పణ.. ఉద్రిక్తతల మధ్య బిల్లు ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను ‘జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) గురువారం రాజసభలో సమర్పించింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పొడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మొత్తానికి తీవ్ర నిరసనల మధ్యే రాజ్యసభ చైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. జేపీసీ నివేదికను రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. జేపీసీ నివేదికలో ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అభ్యంతరాలను నివేదిక నుంచి తొలగించారని ఆరోపించారు. జేపీసీ నివేదికను తిరిగి వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయం సాధించాకే బిల్లు ఆమోదించాలని కోరారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కేంద్రం పని చేస్తోందని ధ్వజమెత్తారు. నకిలీ నివేదికను ఎప్పటికీ అంగీకరించబోమని ఖర్గే స్పష్టం చేశారు.
ఆశలు ఆవిరి.. భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఏ రోజుకారోజు మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 2025 ప్రారంభంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన పెట్టుబడిగా ఉండడంతో బంగారం కొనుగోలుదారులు ఈ పెరుగుదలతో ఏ విధంగా ఎదుర్కోవాలో ఆలోచనలో పడిపోతున్నారు. ఈ నెల ఆరంభం నుంచి బంగారం ధరలు కెరటాల్లాగ ఎగురుకుంటూ వచ్చాయి. కానీ నిన్న కొంచెం తగ్గిన అది పెద్ద ప్రభావం చూపించలేదు. వేలకు వేలు పెరిగి వందలు తగ్గితే అది గణనీయమైన తగ్గింపు కాదు. ఫిబ్రవరి 12వ తేదీన బంగారం ధర ఎలా ఉందో మనందరికీ తెలుసు.. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.79400 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ, 86670 గా ఉన్నట్టు. ఈరోజు అంటే ఫిబ్రవరి 13వ తేదీన బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం పది గ్రాములకు 400పెరిగి రూ. 79,800 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు 380 పెరిగి రూ.87050 గా ఉంది. నిన్నటి పోలిస్తే ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. కానీ ఫిబ్రవరి 11 వ తేదీతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. వెండి మాత్రం స్థిరంగా లక్షా ఏడు వేల వద్దే కొనసాగుతుంది.
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమం.. ఏం జరిగిందంటే..!
క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన రజత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 25 ఏళ్ల రజత్ కుమార్.. మను కశ్యప్ (21) అనే యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే ప్రియురాలితో కలిసి రజత్ కుమార్ ఫిబ్రవరి 9న విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా.. రజత్ కుమార్ చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 2022లో క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడి రజత్ కుమార్ గుర్తింపులోకి వచ్చాడు. రిషబ్ పంత్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారుకి మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో వెళ్తున్న రజత్ కుమార్, అతని స్నేహితుడు నిషు కుమార్‌తో కలిసి రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనతో రజత్ కుమార్ మీడియాలో గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వారిద్దరికీ రిషబ్ పంత్ రెండు స్కూటర్లు కూడా కొని ఇచ్చాడు. ఇదిలా ఉంటే రిషబ్ పంత్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ఒక్క ఏడాదిలోనే రికవరీ అయిపోయాడు. తాజాగా రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు సీరియస్‌గా ఉండడం విశేషం.
ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించిన దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కూడా అతడిని తీసుకోలేదు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ వైపు మొగ్గు చూపలేదు. జట్టు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్ పటీదార్‌కు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆర్సీబీకి 8వ కెప్టెన్ అయ్యాడు 31 ఏళ్ల రజత్. 2021లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన రజత్.. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. ఇక 2023లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి ఇప్పటివరకు మూడు టెస్టులు, ఒక్క వన్డే మాత్రమే ఆడాడు.
‘హిట్ 3’ ఒక్కరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తున్నాడు. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా ఎంట్రీ ఇచ్చి, హిట్ 3 కోసం వెయిట్ చేసేలా చేసిన నాని ఇప్పుడు అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్‌లో హిట్ 3 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన నాని అర్జున్ సర్కార్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ మాస్ హీరో ఎంట్రీ ఉంటుందని ప్రచారంలో ఉంది. ఆయనే హిట్ 4 హీరో అని అంటున్నారు. అంతేకాదు బాలయ్య, రవితేజ హిట్ 4 సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే హిట్ 3లో మాత్రం నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. వాళ్లేవరో కాదు హిట్ ఫస్ట్ కేస్ హీరో విశ్వక్ సేన్, హిట్ సెకండ్ కేస్ హీరో అడివి శేష్ కామియో రోల్‌లో కనిపించనున్నారట. కథలో భాగంగానే ఈ ఇద్దరు నానికి సపోర్ట్‌గా ఇన్విస్టిగేషన్‌కు హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. వాస్తవం ఏమిటో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాబితాలో రామ్ గోపాల్ వర్మ స్థానం ఎవరు బర్తి చేయలేరు.. అతని సినిమాలకు గతంలో ఎలాంటి పాపులారిటి ఉండేదో అందరికీ తెలిసిందే. ప్రజంట్ ఆయన తీరు మొత్తం మారిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ప్రతి ఒకరి మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయితే ప్రజంట్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘శారీ’. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆర్జీవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్ని సూపర్ స్టార్ రజనీ కాంత్ పై అలాగే, బాలీవుడ్ గురించి మాట్లాడుతూ ఎప్పటిలాగే వివాదాస్పద కామెంట్ చేశాడు. వర్మ మాట్లాడుతూ ‘యాక్టింగ్ అనేది క్యారెక్టర్‌కు సంబంధించిన విషయం. పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి స్టార్ అవుతాడు. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంటుంది. రజినీకాంత్ మంచి యాక్టరా? అని అడిగితే నాకు తెలియదు అనే అంటాను. ఎందుకంటే రజినీకాంత్ ‘సత్య’ లాంటి సినిమాను చేయలేకపోవచ్చు. ఆయనను ఇలాగే చూడాలని అందరూ అనుకుంటారు. అసలు స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు.ఆయన సినిమాలో అసలు ఏం చేయకుండా కేవలం స్లో మోషన్‌లో నడిచినా అది చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. వారికి అదే ఆనందాన్ని ఇస్తుంది’ అంటూ ప్రస్తావించాడు.