రోహిత్ శర్మ చాలా కాలం విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగాడు. వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేశాడు.
భారత్లో బీజేపీ దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న పారిస్లో జరిగే ఏఐ సమ్మిట్కు మోడీ అధ్యక్షత వహించనున్నారు.