రాజధాని పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్..! నేడు సీఆర్డీఏ కీలక భేటీ..
నేడు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికార సంస్థ (సీఆర్‌డీఏ) కీలక సమావేశం జరగనుంది.. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీఏ 45వ సమావేశం జరగనుండగా.. రాజధాని పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా ఈ అథారిటీ.. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలపనుంది సీఆర్డీఏ భేటీ.. ఇక, అథారిటీ ఆమోదం పొందగానే ఆయా ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోనుంది సీఆర్డీఏ.. రాజధానిలో ఒకేసారి పెద్దయెత్తున పనులు ప్రారంభించబోతున్నాయి ఏజెన్సీలు..
‘హయగ్రీవ’ భూములపై సర్కార్ షాకింగ్ నిర్ణయం..
ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, హయగ్రీవ సంస్థకు ఝలక్ తగిలింది. విశాఖపట్నం జిల్లా ఎండాడగ్రామం సర్వే నంబర్ 92/3 లో 12.50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని 2008 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు కేటాయించింది. చిలుకూరి జగదేశ్వరుడికి చెందిన ఈ సంస్థకు 2008 డిసెంబర్ ఆరవ తేదీన అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం శాతం స్థలంలో అనాదాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు, మిగతా 90 శాతంలో వయోవృద్ధులకు మాత్రమే గృహ నిర్మాణాలు చేసి విక్రయించే నిబంధనలతో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయింపులు జరిగాయి. అయితే, సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలం కావడంతో రెవిన్యూ అధికారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని 2018లో వెనక్కు తీసుకున్నారు. దీనిపై హయగ్రీవ సంస్థ కోర్టులో సవాల్ చేయగా మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన ప్రతిపాదిత ప్రాజెక్టు అనగా 10 శాతంలో అనాధ, వృద్దాశ్రమాన్ని మూడేళ్ల నిర్మాణం చేసి 90శాతంలో వయోవృద్ధులకు గృహ నిర్మాణా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ భూమితో హయగ్రీవ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. లోప భూయిష్టమైన ఒప్పందాలను అడ్డుగా పెట్టుకుని భూముల్ని అమ్మడం ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 16 సేల్ అగ్రిమెంట్లు, 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి 2022 మే, జూలైలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ., ఆడిటర్.. వైసీపీ నేత గన్నమని వెంకటేశ్వరరావు ఎంట్రీతో ఈ లావాదేవీలు వేగవంతం అయ్యాయి. ఆశ్రమం నిర్మాణం చేస్తూనే విల్లాలను అమ్ముకుని వేలకోట్లు కొట్టేశారనేది ప్రధాన అభ్యంతరం.
నేడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ..
ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. అలాగే.. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవడంపై క్లారిటీ రానుంది. కాగా.. ఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కాగా.. గత బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. దీంతో.. కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. ఈ క్రమంలో.. ఈసారి జరగనున్న సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత సంచలన పోస్ట్..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటుచేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు వారి పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపింది. కాగా.. ప్రణయ్ హత్య కేసులో తీర్పుపై అమృత స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ’10-03-2025′ తేదీని లవ్ సింబల్‌తో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసి పోస్ట్ చేసింది.
నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌లో మోడీ పర్యటన
ప్రధాని మోడీ మంగళ, బుధవారాల్లో మారిషస్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. స్నేహితుడు, ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులంను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత, చారిత్రాత్మక సంబంధం అవసరం అని తెలిపారు. అలాగే అక్కడ ఉన్న భారత సంతతితో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోడీని.. మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులం ఆహ్వానించారు. ఈ మేరకు మార్చి 11, 12 తేదీల్లో ప్రధాని మోడీ మారిషస్‌లో ఉండనున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలు మార్చి 12న జరగనున్నాయి. అలాగే ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నారు.
కేఎల్ రాహుల్ vs అక్షర్ పటేల్.. కెప్టెన్ ఎవరు?
మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ కోసం ఇద్దరు టీమిండియా స్టార్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరికి కెప్టెన్సీ అప్పగించాలో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న అక్షర్‌కే సారథ్యం దక్కే అవకాశాలున్నాయని ప్రాంచైజీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ త్వరలోనే కెప్టెన్ పేరును వెల్లడించనుంది. ఐపీఎల్‌లో అక్షర్ ఇప్పటివరకు కెప్టెన్సీ చేయని విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ తరఫున చాల ఏళ్లుగా ఆడుతున్నాడు. ఢిల్లీకి ఏడో సీజన్ ఆడబోతున్న అక్షర్.. 150 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 123 వికెట్లు, 1653 పరుగులు చేశాడు.
బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్.. ఫైనల్ వెళ్లేందుకు ముంబైకి సూపర్ ఛాన్స్!
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైకి.. ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ఐపీఎల్ మాదిరిలా ఉండదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి టాప్-4లో ఉన్న నాలుగు టీమ్స్ ప్లేఆఫ్స్ ఆడుతాయి. డబ్ల్యూపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి అగ్రస్థానంలో నిలిచిన టీమ్.. నేరుగా ఫైనల్ చేరుతుంది. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచే టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్.. 8 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు, ముంబై 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు సాధించి టాప్-2లో ఉన్నాయి.
హృతిక్ రోషన్ కు గాయం.. వార్ 2 రిలీజ్ డౌటే.?
దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాగా వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేయాల్సిన ఓ ఎనర్జిటిక్ పాట రిహార్సల్స్ సమయంలో హృతిక్ కాలికి గాయమైంది. నొప్పి కాస్త తీవ్రం అవడంతో వైద్యులు చికిత్స అందించారు. అలాగే హృతిక్ కు కొద్దీ రోజులు విశ్రాంతి అవసరమని, కాలిపై భారం పడకూడదం సూచించారట. దాదాపు నెల రోజులు పాటు హృతిక్ రోషన్ కు బెస్ట్ రెస్ట్ అవసరమని సూచించారట వైద్యులు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ చేయబోయే ఈ సాంగ్ ను మే నెలలో షూటింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హృతిక్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. సో ఈ నేపధ్యంలో వార్ 2 రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ పాటను భారీ సెట్స్ నడుమా దాదాపు 500మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నాడట ఆయన్ ముఖర్జీ. బాస్కో మార్టిస్ దీనికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
అక్కడ కూడా ‘ఓదెల 2’ను ప్రమోట్ చేయనున్న తమన్నా
డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ మహాకుంభ మేళాలో విడుదల చేయగా, ఇందులో తమన్నా లేడీ అఘోరాగా కనిపించింది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో ప్రతి ఒక సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ అదిరిపోయింది. యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. అక్కడ వరుస చిత్రాలు, సిరీస్ లు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ క్రేజ్ ని ‘ఓదెల 2’ కి ఉపయోగించుకోనుంది తమన్నా.