ప్రధాని మోడీ మంగళ, బుధవారాల్లో మారిషస్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. స్నేహితుడు, ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గులంను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత, చారిత్రాత్మక సంబంధం అవసరం అని తెలిపారు. అలాగే అక్కడ ఉన్న భారత సంతతితో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: WPL 2025 Final: బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్.. ఫైనల్ వెళ్లేందుకు ముంబైకి ఛాన్స్!
జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోడీని.. మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులం ఆహ్వానించారు. ఈ మేరకు మార్చి 11, 12 తేదీల్లో ప్రధాని మోడీ మారిషస్‌లో ఉండనున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలు మార్చి 12న జరగనున్నాయి. అలాగే ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు