అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది.
భారత్ విధించినట్లుగానే.. తాము కూడా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా ట్రంప్ అదే ప్రకటన చేశారు. వచ్చే నెల నుంచి భారతదేశంతో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. అయితే తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై మంగళవారం భారత ప్రభుత్వం స్పందించింది. సుంకాల తగ్గింపునకు అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ ప్యానెల్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి: World Record: 38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. చివరకు?