శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా..! శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించునుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్లు ఆఫ్‌లైన్ విధానంలో జారీ…
Pakistani Couple: పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట, భారత సరిహద్దు దాటి బీఎస్ఎఫ్కు పట్టుబడింది. పాకిస్తానీ వ్యక్తి, అతడి ప్రేమికురాలు ఇంటి నుంచి పారిపోయి కాలినడకన గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఢిల్లీ పేలుడు కారణంగా మరోసారి పర్యటన వాయిదా పడింది.
సత్యసాయి బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి.. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె.. సత్యసాయి బోధనలు కోట్లాది మందిని…
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె.…
* దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ *ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్.. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం * శ్రీ సత్యసాయి : సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.…
సిట్ అడిగిన ప్రశ్నలకు అన్నీ నిజాలే చెప్పా.. వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నివాసం నుండి వెనుదిరిగారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ను సుబ్బారెడ్డికి చదివి వినిపించినట్లు సమాచారం. విచారణలో భాగంగా, సిట్ అధికారులు సుబ్బారెడ్డి నివాసంలో కొన్ని కీలక పత్రాలను…
ఏపీలో మరో ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుండి…
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ వేదికగా జరుగుతున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు.