ట్రంప్ వాణిజ్యం కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కొత్త వాదన తీసుకొచ్చారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడానికి విధానపరమైన తేడాలు కారణం కాదని.. ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేయకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేయకపోవడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని తెలిపారు. మోడీనే నేరుగా ట్రంప్‌కు ఫోన్ చేయాలని.. కానీ అలా చేయకపోవడం వల్లే వాణిజ్య ఒప్పందానికి బ్రేక్‌లు పడినట్లు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోవార్డ్ లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
వాణిజ్య ఒప్పందం యొక్క రూపురేఖలు సిద్ధంగా ఉన్నాయని.. దానికి ఖరారు చేయడానికి ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్‌కు ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందన్నారు. ట్రంప్‌కు ఫోన్ కాల్ చేసేందుకు మోడీ ఎందుకో ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. గతేడాది నవంబర్ నాటికే రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకుంటాయని అంతా భావించారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఎలాంటి వాణిజ్య చర్చలు కూడా జరగడం లేదు. ఇంకోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలా జరుగుతుండగా రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారత్‌పై 500 శాతం సుంకం విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ట్రంప్ సంతకం చేశారు.