పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.
రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఏపీలో రెండో రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.. తొలిరోజు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. రెండో రోజు కూడా మరికొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.. అవినీతి, అక్రమ లావాదేవీలపై సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నం, పల్నాడు నరసరావుపేట, తిరుపతి సహా మొత్తం 12 సబ్…
కోనసీమలో వద్దు కాకినాడ ముద్దు.. నేడు బంద్కు జేఏసీ పిలుపు నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్…
* నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ-20.. మధ్యా్హ్నం 1.45 గంటలకు కరార వేదికగా టీ-20 మ్యాచ్ * బీహార్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. తొలివిడతలో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.75 కోట్ల మంది ఓటర్లు.. బరిలో 1,314 మంది అభ్యర్థులు.. నవంబర్ 14న ఫలితాల ప్రకటన * తొలివిడతలో బీహార్లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 7 గంటల…
కోడికి.. గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారు..! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకపోవడంతో రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తున్నాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు.. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీ నెలా జీతాలు తీసుకుంటున్నారని…