కార్తీక మాసం రద్దీ.. ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల…
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారతీయ టెన్నిస్ లెజెండ్, రెండు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రోహన్ బోపన్నా తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 20 సంవత్సరాలకు పైగా కొనసాగిన ఈ అద్భుతమైన ప్రయాణానికి ముగింపు పలికిన ఈ 45 ఏళ్ల అథ్లెట్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును పోస్టు చేశారు. బోపన్న చివరిసారిగా పారిస్ మాస్టర్స్ 1000లో అలెగ్జాండర్ బుబ్లిక్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడాడు. నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు.. మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు…
కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.