మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక…
వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఈ రికార్డును స్మృతి సేన బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 491/4 పరుగులు చేసింది. అంతర్జాతీయ…
సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో ఈ సిరీస్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా అదరగొట్టిన స్మృతి.. ఇప్పుడు కెప్టెన్‌గానూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 11 నుంచి మ్యాచ్…
IND Women vs WI Women: టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్ లో,…
అండర్-19 ఆసియా కప్ 2024 విజేతగా భారత మహిళా జట్టు నిలిచింది. ఆదివారం కౌలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్ అయింది. జువైరియా ఫెర్డోస్ (22) టాప్ స్కోరర్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో తొలిసారి జరిగిన అండర్-19 ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇటీవలే అండర్-19 పురుషల ఆసియా కప్ ఫైనల్లో…
AUS vs IND: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 371 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్‌లు తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 40 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టారు. ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు బ్యాట్స్‌ఉమెన్‌లు సెంచరీలు సాధించారు. ఈ ఇన్నింగ్స్ లో జార్జియా వాల్ 87 బంతుల్లో 101 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ పెర్రీ 75…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే…
India Women Out From T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాయాది పాక్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అవ్వడంతో 54 పరుగులతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దాయాది పాక్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు కూడా గల్లంత్తయ్యాయి. న్యూజిలాండ్ దెబ్బకు దాయాది దేశాలు ఇంటిదారి పట్టాయి. ఈ మ్యాచ్‌లో…
IND W vs NZ W: టీ20 ప్రపంచకప్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. న్యూజిలాండ్ జట్టు 58 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 102 పరుగులకే ఆలౌటైంది. ముక్యముగా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరకు హర్మన్‌ప్రీత్ సేనకు…
India Women vs NZ Women: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించాలని కోరుకుంటోంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఇది నాలుగో మ్యాచ్ కాగా, న్యూజిలాండ్ కు కూడా తొలి మ్యాచ్ ఆడనుంది. భారత…