మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి మెగా టోర్నీని సాధించింది. భారత్ సెమీస్ చేరడంలో ఓపెనర్ ప్రతీక రావల్ కీలక పాత్ర పోషించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్ మ్యాచ్‌లో ప్రతీక సెంచరీ (122) బాదింది. న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ నాకౌట్‌కు అర్హత సాధించింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచులో గాయపడి.. టోర్నీ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా సెమీస్, ఫైనల్…
వన్డే ప్రపంచకప్ 2025ని భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. మొదటిసారి మెగా టోర్నీ అందుకుంది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిన భారత్.. ఈసారి మాత్రం కప్ కల నెరవేర్చుకుంది. ఈ విజయంతో మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారత మహిళా జట్టు ట్రెండింగ్‌లో నిలిచింది.…
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట…
2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.…
Women’s ODI WC winners: ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి.. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్‌ప్రీత్ సేన తెరదించింది. ఈ విజయంతో భారత దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలవగా..…
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ విజయంతో లంక సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. నాలుగు జట్లు భారత్, న్యూజిలాండ్, శ్రీలంక సహా పాకిస్తాన్ టీమ్స్ ఇప్పుడు నాలుగో స్థానం కోసం రేసులో ఉన్నాయి. లీగ్ దశలో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి…
ఆసియా కప్ 2025 ముగిసిందని క్రికెట్ అభిమానులు చింతించాల్సిన అవసరం లేదు. నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం అవుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మెగా క్రికెట్ టోర్నీ జరుగుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవని భారత జట్టు.. ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది చూడాలి.…
IND W vs SL W: కోలంబోలోని ఆర్.పి.ఎస్ మైదానంలో నేడు జరిగిన శ్రీలంక మహిళల వన్డే ట్రై సిరీస్‌లో భారత్‌పై శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. Read Also: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు…
అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 30 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో.. ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ లోకి అడుగుపెట్టింది భారత మహిళల జట్టు.