T20 World Cup 2024: పాకిస్తాన్ ఓటమి.. భారత్ ఇంటికి!
- పరుగులతో న్యూజిలాండ్ విజయం
- టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ అవుట్
- భారత్ సెమీస్ ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Out From T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాయాది పాక్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అవ్వడంతో 54 పరుగులతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దాయాది పాక్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు కూడా గల్లంత్తయ్యాయి. న్యూజిలాండ్ దెబ్బకు దాయాది దేశాలు ఇంటిదారి పట్టాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 110 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (28) టాప్ స్కోరర్ కాగా.. జార్జియా ప్లిమ్మర్ (17), సోఫి డివైన్ (19), బ్రూక్ హ్యాలీడే (22) పరుగులు చేశారు. పాక్ బౌలర్ నష్రా సంధు మూడు వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్ అయింది. ఫాతిమా సనా (21) పరుగులు చేసింది. మునీబా అలీ (15) తప్ప మరే బ్యాటర్ రెండంకెల స్కోర్ అందుకోలేదు. అమేలియా కెర్ మూడు వికెట్స్ తీసింది.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆసీస్ నాలుగింటికి నాలుగు గెలిచింది. కివీస్ నాలుగు మ్యాచులలో మూడు గెలిచి.. సెమీస్‌కు చేరుకుంది. ఆడిన నాలుగు మ్యాచులలో రెండు గెలిచిన భారత్ ఇంటిదారి పట్టింది. పాక్ ఒక విజయం మాత్రమే సాధించింది. శ్రీలంక అన్ని మ్యాచులలో ఓడింది. గ్రూప్-బీలో ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖరారు కాలేదు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..