IND W vs NZ W: టీ20 ప్రపంచకప్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. న్యూజిలాండ్ జట్టు 58 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 102 పరుగులకే ఆలౌటైంది. ముక్యముగా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరకు హర్మన్‌ప్రీత్ సేనకు తొలి మ్యాచ్ లోనే ఓటమిని తప్పించుకోలేకపోయింది.
Rajendra Prasad : సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.
మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఏ దశలోనూ టార్గెట్ దిశగా పయనించలేదు. రెండో ఓవర్ తొలి బంతికే మొదలైన వికెట్ల పతనం ఆపై కొనసాగుతూనే ఉంది. టీమిండియా 11 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోగా.. ఇక 70 పరుగులు చేసే సరికే సగం వికెట్లను కోల్పోయింది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్లు స్మృతి మంధానా (12), షెఫాలీ వర్మ (2), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15), జెమీమా రోడ్రిగ్స్ (13), రిచా ఘోష్ (12), దీప్తి శర్మ (13) వరుసగా ఒక్కొక్కరు పెవిలియన్ చేరుతూ వచ్చారు. ఈ సమయంలో మరోవైపు న్యూజిలాండ్ బౌలర్స్ రోజ్‌మేరీ మెయిర్ 4, లియా తాహుహు 3, ఈడెన్ కార్సన్ 2 వికెట్లు తీశారు. టీంఇండియాలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ చేసిన 15 పరుగులే టాప్ స్కోర్.
Rajasaab : ముగ్గురు హీరోయిన్లలో మాస్ స్టెప్పులేయనున్న ‘ది రాజా సాబ్’… థియేటర్లు షేకే
ఇకపోతే ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ 2024లో తన తదుపరి మ్యాచ్ ను అక్టోబర్ 6 (ఆదివారం) నాడు పాకిస్థాన్ తో తలపడనుంది. ఇక గ్రూప్ A లో మరోవైపు పాకిస్థాన్ వుమెన్ టీమ్ తన తొలి మ్యాచ్ లో శ్రీలంకను 31 పరుగులతో చిత్తు చేసి శుభారంభం అందుకుంది. టీమిండియా తాజా ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పాకిస్థాన్ తో ఆడనుందో. చుడాలిమరి ఆ మ్యాచ్ లోనైనా టీంఇండియా బోణీ చేస్తుందో లేదో.
New Zealand start their #T20WorldCup campaign with a win! 💥
They end their 10-match winless streak in T20Is 🔥#INDvNZ #WhateverItTakes
📝: https://t.co/1uWmRA4BaS pic.twitter.com/UIYZkiIjNp
— ICC (@ICC) October 4, 2024