AUS vs IND: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టీమిండియా పై భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 371 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ ఉమెన్‌లు తమ ఇన్నింగ్స్‌లో మొత్తం 40 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టారు. ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు బ్యాట్స్‌ఉమెన్‌లు సెంచరీలు సాధించారు. ఈ ఇన్నింగ్స్ లో జార్జియా వాల్ 87 బంతుల్లో 101 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ పెర్రీ 75 బంతుల్లో 105 పరుగులు చేసింది. పెర్రీ 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టింది. వీరితోపాటు బెత్ మూనీ కూడా 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు 19.2 ఓవర్లలో 130 పరుగులు జోడించారు. ఈ స్కోరులో లిచ్‌ఫీల్డ్ (60) సైమా ఠాకోర్ అవుట్ అవ్వగా.., దీని తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పెర్రీ వేగంగా బ్యాటింగ్ ప్రారంభించి 43 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
Also Read: IND vs BAN: ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా లక్ష్యం 199
మరో ఎండ్ నుంచి వాల్ కూడా తన రెండో వన్డేలో సెంచరీ సీగేసింది. 84 బంతులలో సెంచరీ చేసింది. అయితే, సెంచరీ పూర్తి చేసిన తర్వాత వాల్‌ను ఠాకోర్ అవుట్ చేసింది. కానీ, పెర్రీ మాత్రం వేగంగా ఆడుతూ కేవలం 72 బంతుల్లో సెంచరీ పూర్తి చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా 300 పరుగులు పూర్తి చేసింది. 105 పరుగుల వద్ద దీప్తి శర్మ బౌలింగ్‌లో ఎల్లీస్ పెర్రీ ఔటైంది. పెర్రీ ఔట్ అయిన తర్వాత అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డనర్ త్వరత్వరగా అవుటయ్యారు. కానీ, బెత్ మూనీ కూడా ఫాస్ట్ గా ఫిఫ్టీ కొట్టి ఆస్ట్రేలియాను 371 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లింది.భారత్ తరఫున సైమా ఠాకూర్ 10 ఓవర్లలో 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మిన్ను మని 2 వికెట్లు తీసింది.
Also Read: Viral Video: కారుపై ఆభరణాలు వదిలి వెళ్లిన యువతి.. ఎవరైనా దొంగిలిస్తారా? అని ప్రయోగం..(వీడియో)
ఇక భారీ లక్ష చేధనకు వచ్చిన టీమిండియా కేవలం 44.5 వర్లలో కేవలం 249 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దింతో ఆస్ట్రేలియా 122 పరుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఇండియన్స్ మెన్స్ టీం రెండో టెస్టులో 10 వికెట్లతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.