లార్డ్స్ వేదికగా కీలక సమరానికి టీమిండియా, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. తొలివన్డే విజయం ఇచ్చిన ఊపులో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు ఇండియా తహతహలాడుతోంది. తొలివన్డేలో బుమ్రా, షమీ సహా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తో పది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. రెండో వన్డేలోనూ ఇదే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది. గాయం…
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా.. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే మ్యాచ్‌లో అర్థశతకం సాధించడంతో పాటు మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు 2009-10లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే 60 పరుగులు చేయడంతో పాటు 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు…
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే! అప్పటివరకూ ఆచితూచి ఆడిన బెయిర్‌స్టో.. కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత చెలరేగిపోయాడు. భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. టీ20ని తలపించాడని చెప్పుకోవచ్చు. దీంతో, కోహ్లీ అతడి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ వ్యక్తపరిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తుల్ని…
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతోన్న జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఒక ఓవర్లో 35 (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) పరుగులు చేసి, టెస్టుల్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఇప్పుడు వికెట్ల పరంగా మరో ఘనత సాధించాడు. ఇప్పటివరకూ 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా…
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. నిజానికి.. మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందునుంచే వాతావరణంలో తేడాలు కనిపించడంతో, వర్షం రావొచ్చని అంచనా వేశారు. అనుకున్నట్టే.. వరుణుడు కారుమబ్బుల్ని వెంటేసుకొని వచ్చాడు. తొలుత కాసేపు బ్రేక్ ప్రకటించిన అంపైర్లు.. వాతావరణ మార్పుల దృష్ట్యా లంచ్ బ్రేక్‌గా ప్రకటించారు. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ని తిరిగి ప్రారంభించనున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. తొలుత టాస్…
భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి (జులై 1) నుంచి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మోయిన్ అలీ భారత్‌ను హెచ్చరించాడు. ఇంతకుముందు కంటే ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు పటిష్టంగా తయారైందని, ఇటీవల న్యూజీల్యాండ్ను 3-0తో క్లీన్‌స్వీప్ ఆ జట్టు మరింత జోష్ మీద ఉందని, అలాంటి ఇంగ్లండ్‌ను ఆపడం చాలా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ గతేడాదే ఈ ఐదో టెస్ట్ మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకే అనుకూలమైన ఫలితం వచ్చేదని..…