Zomato Has A Hilarious Query For Rishi Sunak About India’s Semi-Final Match: ఆస్ట్రేలియాలో జరగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురువారం జరుగుతోంది. అయితే ఈ మ్యాచులో ఇండియా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్స్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడాలని యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జోమాటో చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. T20 సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు యూకే ప్రధాని రిషి సునక్‌కి జొమాటో చేసిన ఫన్నీ ట్వీట్ వైరల్ అయ్యింది.
Read Also: Exclusive: అనూష శెట్టితో నాగశౌర్య ప్రేమ వివాహం…
రిషి సునాక్ ను ఉద్దేశిస్తూ.. జోమాటో ఫన్నీగా ‘‘ హలోసార్ ఈ రోజు ఇంగ్లీష్ టీ కావాలా లేక మసాలా ఛాయ్ కావాలా..?’’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల యూకేకు ప్రధానిగా ఎన్నికయ్యారు రిషి సునాక్. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి యూకేకు ప్రధాని కావడం ఇది మొదటిసారి. రిషి సునాక్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని వివాహం చేసుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ట్వీట్ చేసింది. ఇంగ్లాండ్ తో జరిగే సెమీఫైనల్ లో రిషి సునక్ ఎవరికి మద్దతు పలుకుతాడో అని తెలుసుకునేందుకు ఫన్నీగా జోమాటో ఈ ట్వీట్ చేసింది.
hello sir @RishiSunak, english tea or masala chai today?
— zomato (@zomato) November 10, 2022
ఇప్పటికే ఈ ట్వీట్ కు 3200 లైకులు వచ్చాయి. వందల కొద్దీ కామెంట్లు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం భారత్, ఇంగ్లాండ్ మధ్య ఉన్న ఛాయ్ సంబంధాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. కొంతమంది నెటిజెన్లు మసాలా టీకి కోరుకుంటాడని కామెంట్లు చేయగా.. మరోకరు రిషి సునాక్ ‘‘ఛాయ్ టీ’’ కోరుకుంటాడని కామెంట్ చేశారు. ఇంకొందరు రిషి సునాక్ ఫోటోను పెట్టి‘‘ ధర్మసంకటం’’లో పడేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— Sagar Yadav (@sagaryadav11_) November 10, 2022
chai tea only!
— Deeksha Sharma (@deekshay_) November 10, 2022