భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా.…
ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ప్రారంభం కావాల్సిన చివరి టెస్ట్‌ను (ఈసీబీ ) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఈ చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు భారత జట్టు ఫిజియోకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే మరిన్ని కరోనా కేసులు నమోదు అవుతాయోనన్న అనుమానంతో మ్యాచ్ రద్దు చేశారు. మరోవైపు మ్యాచ్ రద్దు ప్రకటన చేసే క్రమంలో హైడ్రామా నెలకొంది. మొదట వాయిదా అని ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత…
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులలో 2-1 టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనతో పటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉన్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఈ మ్యాచ్.. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో… 23వేల పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్… వన్డేలు, టెస్టుల్లో కలిపి 23వేల పరుగుల మార్క్‌ను దాటారు. తాజాగా ఈ జాబితాలో విరాట్…
లీడ్స్ టెస్ట్‌లో టీమిండియా చేతులెత్తేసింది.. మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన తొలిరోజే ఏమాత్రం ప్రతిఘటన చేపకుండా పెవిలియన్‌ను క్యూకట్టారు భారత బ్యాట్స్మెన్లు.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది.. ఘోరంగా విఫలం అయ్యారు భారత బ్యాట్స్‌మెన్స్.. పేస్ పిచ్‌పై ఏమాత్రం బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.. భారత ఇన్సింగ్స్‌లో రోహిత్ శర్మ 19, రహానె 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్ చేయలేదు.. విరాట్ కోహ్లీ 7 పరుగులు చేస్తే.. రవీంద్ర జడేజా…
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ…
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన…