అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అయింది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ వరుసగా పదో సారి టాస్ ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ…
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డేల్లో ఇంగ్లీష్ జట్టుపై ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచిన రోహిత్ సేన.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం చివరిదైన మూడో వన్డే ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఇది నామమాత్రమైన మ్యాచ్ అయినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట ఆడబోతున్న చివరి వన్డే కావడంతో తేలిగ్గా తీసుకోవట్లేదు. ఈ మ్యాచ్‌లో భారత్…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది.
కటక్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు అనుకుంటున్నారా..? రోహిత్ శర్మ మాట్లాడుతున్నట్లు కనిపించిన ఫోన్ గురించి.. రోహిత్ చేతిలో ఉన్నది ఐఫోన్, ఇంకా ఏదో పెద్ద ఫోన్ కాదు.. వన్‌ప్లస్ ఫోన్ 12.
టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేయడంతో ఈ ఘనత సొంతమైంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు 15,404 పరుగులు చేశాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు. సచిన్…
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గాయం కారణంగా మొదటి వన్డే ఆడని విరాట్.. రెండో వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లండ్ డీఆర్ఎస్ తీసుకుని సక్సెస్ అయింది. Also Read:…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జో రూట్ (69; 72 బంతుల్లో 6×4), డకెట్ (65; 56 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ…
గత కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ శతకం బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట హిట్‌మ్యాన్…