భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. రెండో వన్డే బారాబాతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 305 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 32వ వన్డే సెంచరీ సాధించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. రోహిత్ అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు.
కాగా.. కటక్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు అనుకుంటున్నారా..? రోహిత్ శర్మ మాట్లాడుతున్నట్లు కనిపించిన ఫోన్ గురించి.. రోహిత్ చేతిలో ఉన్నది ఐఫోన్, ఇంకా ఏదో పెద్ద ఫోన్ కాదు.. వన్‌ప్లస్ ఫోన్ 12. ఇండియాలో OnePlus 12 ధర రూ. 58 వేల నుండి రూ. 61 వేలు ఉంది. ఇంత పెద్ద క్రికెటర్ వన్ ప్లస్ ఫోన్ మాట్లాడటమేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: Speaker Ayyanna Patrudu: ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు..!
ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ హీరోగా నిలిచాడు. రోహిత్ 90 బంతుల్లో 132.22 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. 2023 అక్టోబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన తొలి వన్డే సెంచరీ సాధించాడు. మార్చి 2024 తర్వాత ఇది అతని తొలి సెంచరీ. 2024 అక్టోబర్ తర్వాత రోహిత్ పేలవమైన ఫామ్‌ను ఎదుర్కొన్నాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లతో సహా 8 మ్యాచ్‌ల్లో అతను ఒక్కసారి మాత్రమే యాభై మార్కును దాటాడు. ఆ తరువాత.. విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా అద్భుతమైన సెంచరీ సాధించి అందరి నోళ్లు మూయించాడు.
Captain Rohit Sharma uses One Plus phone…!!!📱☎️ pic.twitter.com/9u0oxUsV8L
— Gurlabh Singh (@Gurlabh91001251) February 9, 2025