ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించిందని, తన బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టానని, వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు.. తన ప్రణాళికలు అమలు పరిచానని హిట్‌మ్యాన్ తెలిపాడు. శుభ్‌మన్ క్లాసీ ప్లేయర్ అని, పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడని రోహిత్ ప్రశంసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా…
కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
India vs England: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశ్యంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనితో…
India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో…
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత జట్టు 248 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. యశస్వి అరంగేట్రంలోనే అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. బెన్ డకెట్ క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా పట్టుకున్నాడు.
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజా రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు.
IND vs ENG: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు…
వాంఖడే స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన టీమిండియా కుర్రాళ్లు భారీ స్కోర్ అందించారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్…